క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో జేడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచిర్యాల, నవంబర్ 12: మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేటలోని పశు సంవర్థక శాఖ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఎల్లన్నను సోమవారం ఏసీబీ అధికారులు రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ వివరాల ప్రకారం ప్రభుత్వం.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన వెంకటేశ్వర్ రావు అన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్ట్ పోందారు. ఈ మేరకు తమిళనాడు నుండి ఇప్పటికే మొదటి విడతగా గొర్రెలను రవాణా చేశారు. దీనికి సంబంధించిన రూ. 30 లక్షల బిల్లులు రావాల్సి ఉండగా రూ. లక్ష లంచం ఇస్తేనే బిల్లులు ఇప్పిస్తానని జేడిఏ ఎల్లన్న పలుసార్లు బెదిరింపులకు గురి చేయడంతో వేధింపులు తట్టుకోలేక మొదట 20 అక్టోబర్ రూ. 20 వేలు చెల్లించాడు. మిగతా డబ్బులు రూ. 50 వేలు చెల్లించే విషయంలో జేడీ వేధింపులకు గురి చేస్తుండగా కాంట్రాక్టర్ వెంకటేశ్వర్ రావు తన కాంట్రాక్ట్ ను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుసుకొని ఏసీబీని ఆశ్రయించడంతో సోమవారం ఏసీబీ అధికారులు కరీంనగర్ డీఎస్పీ ప్రతాప్‌తో పాటు ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌లు పథకాన్ని రూపొందించి రూ. 50 వేలు ఇస్తుండగా కార్యాలయంలో జేడి ఎల్లన్నను పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. జేడీ ఎల్లన్నను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. జన్నారం మండలం పోన్కల్ మేజర్ గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఎల్లన్న కొనసాగుతున్నారు.
గత్యంతరం లేని పరిస్థితుల్లో...
గొర్రెలు రవాణా చేసిన బిల్లులు చెల్లించేందుకు పలు వేధింపులకు గురి చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించానని వెంకటేశ్వర్ రావు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలోభాగంగా కర్ణాటక నుండి మంచిర్యాల జిల్లా వివిధ ప్రాంతాలకు గొర్రెలను తరలించాను. రూ. 30 లక్షల బిల్లులు రవాల్సి ఉందని, లక్ష లంచం ఇస్తేనే బిల్లులు తయారు చేస్తానని, పలు సార్లు డబ్బుల కోసం వేధింపులకు గురి చేశారని ఆరోపించారు. బెదిరింపులు తాళలేకనే రూ. 50 వేలు చెల్లించానని అయినప్పటికీ మరో 50 వేల కోసం వేధిస్తుండటంతో ఏసీబీ అధికారులకు పట్టించినట్లుగా పేర్కొన్నారు.
కుట్ర పన్ని ఇరిక్కించారు
గొర్రెల ట్రాన్స్‌పోర్టు విషయంలో లంచం డిమాండ్ చేయలేదని నాపై కుట్ర పనే్న పథకం ప్రకారం కేసులో ఇరిక్కించారని, జేడీ ఎల్లన్న పేర్కొన్నారు. గొర్రెల ట్రాన్స్‌పోర్టు బిల్లుల చెల్లింపు విషయంలో జాప్యం జరిగిన విషయం వాస్తవమేనని తాను ఎలాంటి డబ్బులు తీసుకోలేదని, తన జేబులో డబ్బులు పెట్టి అన్యాయంగా ఏసీబీకి పట్టించారని తెలిపారు.

చిత్రం..జేడి ఎల్లన్నను విచారిస్తున్న ఏసీబీ అధికారులు