క్రైమ్/లీగల్

వివాహితపై పోలీసుల అత్యాచారయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం,నవంబర్ 13 : గుడిపల్లి మండల పరిధిలోని గుత్తాల పల్లి గ్రామంలో ఒక వివాహితపై అత్యాచార యత్నం జరిగింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటన వివరాలిలాఉన్నాయి. గుత్తాలపల్లికి చెందిన వివాహిత మూడురోజుల కిందట పశువులు మేపుకుంటూ బాట గంగమాంబ దేవాలయం వద్దకు వెళ్లింది. అప్పటికే బిజిగానిపల్లి గ్రామానికి చెందిన ఎ ఆర్ కానిస్టేబుల్ తిమ్మయ్య, ఆర్మీ ఉద్యోగి చలపతి పీలకదాగా మద్యం సేవించి ఉన్నారు. ఆవివాహిత పై కనే్నసిన వారు కోర్కెను తీర్చమంటూ ఆమె వెంట పడ్డారు. అప్పటికే సమీపంలోని ఆమె భర్త పరుగున వచ్చి వీరిపై దాడి చేశారు. అంతలో గ్రామస్థులకు విషయం తెలిసి అందరూ మూకుమ్మడిగా దాడి చేసి గుడుపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.