క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, మార్చి 5: ఆర్టీసీ బస్సు కిందపడి ఇంజనీరింగ్ విద్యార్ధి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలోని అవుషాపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగింది. విద్యార్ధి మృతితో తోటి విద్యార్ధులు జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేయడంతో రెండు గంటలపైగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించగా విద్యార్ధి మృతికి కారణమైన డ్రైవర్‌ను అరెస్టు చేసి నష్టపరిహారం చెల్లించేవరకు కదిలేది లేదని విద్యార్ధులు ఆందోళనకు దిగారు. ఆందోళన ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగ ప్రవేశంచేసి చెదరగొట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి- హైద్రాబాద్-వరంగల్ జాతీయ రహదారి అవుషాపూర్ గ్రామంలోని బస్టాప్ వద్ద అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్ధులు బస్సు ఎక్కేందుకు నిలబడి ఉన్నారు. సికింద్రాబాద్ వైపు వెళ్లుచున్న పికెట్ డిపో బస్సు వచ్చింది. దీంతో బస్సుఎక్కేందుకు యత్నిస్తుండగా బస్సు కదలటంతో వికాస్‌రెడ్డి అనే విద్యార్ధి ప్రమాదవశాత్తు వెనుక చక్రాల కింద పడగా తలపై నుండి బస్సు చక్రాలు వెళ్లటంతో తల పూర్తిగా నలిగిపోయినట్లు పేర్కొన్నారు. మృతుడు కీసర మండలం దమ్మాయిగూడ గ్రామానికి చెందినట్లు అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఇన్‌స్పెక్టర్ పి..రఘువీర్‌రెడ్డి తెలిపారు.