క్రైమ్/లీగల్

యువకుడి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, నవంబర్ 13: కాప్రా నేతాజీనగర్ చౌరస్తాలోని పాన్ షాపు ముందు యువకుడిని కిడ్నాప్ చేసిన సంఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ చంద్రశేఖర్ వివరాల ప్రకారం నేతాజీనగర్‌కు చెందిన వేణుగోపాల్ (35)ను టాటా సుమోలో వచ్చిన నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. వేణుగోపాల్‌ను బలవంతంగా సుమోలో ఎక్కించగా అడ్డుకున్న స్నేహితుడు దీపక్‌ను ఆ వ్యక్తులు కొట్టారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలతో గాలిస్తునట్లు పేర్కొన్నారు.