క్రైమ్/లీగల్

అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణఖేడ్ నవంబర్ 13 ఇంటిలిజెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శ్రీనివాస్‌రెడ్డితోపాటు స్పెషల్ పార్టీ అధికారులు బృందం మంగళవారంనాడు బేల్ట్ షాపులకు తరలిస్తున్న అక్రమ మద్యాన్ని ఖేడ్ పట్టణంలో పంచగామవేళ్లే దారిలో మాటు వేసి పట్టు కున్నారు. ఇందులో బోరంచకు చెందిన నగేష్, నారాయణఖేడ్ మండలం బండ్రన్‌పల్లి గ్రామానికి చెందిన అంబయ్యలు మద్యం తరలిస్తుండగా పట్టుకున్నామని ఎక్స్‌యిజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి విలేఖరులకు తెలిపారు. ఇద్దరి వద్ద 4 కాటన్‌లు మద్యం లభించినట్లు చెప్పారు. ఇద్దరిని అరెస్ట్ చేసిన వారిపై కేసునమోదు చేసి కోర్టుకు తరలించామన్నారు. ఇందులో ఎక్సైయిజ్ ఎస్పీజానయ్య, ఇంటిలీజెన్స్‌హెడ్‌కానిస్టేబుల్ నందుసింగ్, ఎస్ ఐ బాస్కర్‌గౌడ్, స్పెషల్‌పార్టీ హెడ్ కానిస్టేబుల్ సిద్దయ్య, రాజు,రమణ పాల్గొన్నారు.
పెద్దశంకరంపేటలో...
పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండల పరిధిలోని టి.వెంకటాపూర్ గ్రామంలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై విజయరావు తెలిపారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా గ్రామాల్లో బెల్ట్ షాపుల ద్వారా మధ్యం విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు తాము రైడ్ చేయగా గ్రామానికి చెందిన బుగుడాల ప్రవీన్‌కుమార్ వద్ద 16 ఫుల్ బాటిళ్లు, 18 ఓసీ బాటిల్లు దొరికాయిని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.