క్రైమ్/లీగల్

అధిక వడ్డీ పేర ప్రజలను దోచుకున్న ఫైనాన్ స వ్యాపారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 13: అధిక వడ్డీ ఆశచూపి రూ.3.50 కోట్ల శఠగోపం పెట్టి ప్రజలను బురిడీ కొట్టించి ఫరారైన ఫైనాన్స్ నిర్వాహకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్‌లోని అశోక్‌నగర్ ప్రాంతంలో నివసిస్తున్న నాగబోతు శంకరయ్య (58) అక్రమ ఫైనాన్స్ వ్యాపారం నిర్వహించి డబ్బులు తీసుకొని ప్రజలను బురిడీ కొట్టించి ఫరారయ్యాడని, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డిపేటకి చెందిన శంకరయ్య కరీంనగర్‌కు వచ్చి మెడికల్ ఫార్మసీ నడిపిస్తూ పరిచయాలు పెంచుకొని ఫైనాన్స్ వ్యాపారం కొనసాగించాడని వివరించారు. 2011లో 22 మందితో, 2012లో 21 మంది సభ్యులతో అనధికార ఫైనాన్స్ దందాను కొనసాగించి ఒక్కో సభ్యుని వద్ద రెండు లక్షల 50 వేల రూపాయలు తీసుకున్నాడని, వారికి వచ్చిన లాభాల్లో 2.40 శాతం చెల్లిస్తామని నమ్మబలికి డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు. వలపన్ని పట్టుకున్నామని అతని వద్ద రూ.3 కోట్ల 48 లక్షల 29 వేల 380 బాకీలు ఉన్నాయని, పట్టుబడ్డ నిందితునిపై కేసు నమోదుచేశామన్నారు.