క్రైమ్/లీగల్

ముగ్గురు దొంగలు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంగళగిరి, నవంబర్ 14: నార్త్ సబ్‌డివిజన్ పరిధిలోని తాడికొండ, మంగళగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో కారు, నగలు, నగదు చోరీ చేసిన కేసుల్లో ముగ్గురు దోపిడీ దొంగలను అరెస్ట్ చేసి వారినుంచి కారును, లక్షా 92 వేల నగలు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ జీ రామకృష్ణ వెల్లడించారు. బుధవారం మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో రెండు వేర్వేరు కేసులకు సంబంధించిన వివరాలను డిఎస్పీ వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాడికొండ మండలం మోతడక గ్రామంలో కంచర్ల నాగేంద్రమ్మ ఇంట్లో దోపిడీకి పాల్పడి 16,500 రూపాయల నగదు, నాలుగు బంగారు గాజులు, గొలుసు, రెండు ఉంగరాలు, పోగులు మొత్తం 2 లక్షల 36 వేల విలువైన బంగారు వస్తువులను దోచుకు పోయిన కేసులో నిందితులైన మందడం గ్రామానికి చెందిన కొజ్జా మహిమయ్య, దాసు అనే నిందితులను అరెస్ట్ చేసి వారినుంచి లక్షా92 వేల రూపాయల విలువైన నగదు, నగలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ వెల్లడించారు. పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు నివాసంలో కారును దొంగిలించిన కేసులో నిందితుడైన సాయికృష్ణను అరెస్ట్ చేసి అతనినుంచి ఏడున్నర లక్షల రూపాయల విలువైన కారును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ రామకృష్ణ వివరించారు. పెదకాకాని సిఐ శేషగిరిరావు ప్రత్యేక బృందంతో కేసుదర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారని డిఎస్పీ తెలిపారు. రూరల్ సిఐ సుబ్బారావు, పెదకాకాని సిఐ శేషగిరిరావు, ఎస్సై రాజశేఖర్ పాల్గొన్నారు.