క్రైమ్/లీగల్

చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాతబస్తీ, మార్చి 5: నగరంలో వేర్వేరు పోలీసు స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ముగ్గురిని సీసీఎస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారి నుండి రూ. 7 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ప్రాంగణంలోని సీసీఎస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఏడీసీపీ షరీన్ బేగం వివరాలు వెల్లడించారు. కర్నాటకలోని బళ్లారి జిల్లాకు చెందిన రాఘవేంద్రకుమార్ (25) అనే వ్యక్తి తన తల్లిదండ్రులు మరణించటంతో అన్నదమ్ములతో ఉన్న విభేదాల కారణంగా గుంటూరు వచ్చి వంట పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఆ ప్రాంతంలోని పిట్టల పార్వతి (45), పిట్టల రేణుక (27)తో పరిచయం ఏర్పడింది. వీరు ముగ్గురు భవానీపురం కుమ్మరిపాలెం సెంటర్‌కు వలస వచ్చి వంట పని చేస్తూ జీవిస్తున్నారు. అయితే రాఘవేంద్రకుమార్ చెడు వ్యసనాలకు అలవాటుపడి పనులు లేని సమయంలో తనతో ఉన్న ఇద్దరు మహిళలతో కలిసి స్నానాల ఘాట్, బస్టాండ్, ఇతర రద్దీ ప్రాంతాల్లో మహిళల బ్యాగుల్లోని వస్తువులను కాజేస్తుంటారు. ఆ క్రమంలో నిందితులు గవర్నరుపేట, వన్‌టౌన్, భవానీపురం స్టేషన్ పరిధుల్లో ఒక్కోటి, మాచవరం, కృష్ణలంకలో రెండేసి నేరాలకు పాల్పడ్డారు. ఆయా బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో భవానీపురం, కుమ్మరిపాలెం సెంటర్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న రాఘవేంద్రకుమార్, పార్వతి, రేణుకలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాము నేరాలకు పాల్పడినట్లు అంగీకరించారు. దాంతో వారిని విచారించి వారి నుంచి మూడున్నర లక్షల విలువైన బంగారు సొత్తును స్వాధీనం చేసుకున్నారు.