క్రైమ్/లీగల్

అప్పుల బాధతో పత్తి రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టేకులపల్లి, నవంబర్ 16 : పత్తి పంట సాగు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి మనస్తాపానికి గురై ఒక రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మద్రాసుతండాలో గురువారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం కోయగూడెం గ్రామ పంచాయతీలోని మద్రాసుతండాకి చెందిన బానోతు నగేశ్ (30)కు పది సంవత్సరాల క్రితం జ్యోతితో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమార్తెలు. తనకున్న ఐదు ఎకరాల ఆర్‌వో ఎఫ్‌ఆర్ భూమిలో పత్తిసాగు చేస్తున్నాడు. గత ఏడాది పత్తి పంట దిగుబడి తగ్గి, సరైన ధర లేకపోవడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. దీంతో ఈసారైనా పత్తి సక్రమంగా పండకపోతుందానని, తన ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మొదట్లో వర్షాలు బాగానే పడుతుండటంతో ఆశాజనకంగా ఉన్నందున పెట్టుబడి పెంచి సాగు చేశాడు. ఆ తరువాత వర్షాభావంతో పత్తి పూత, కాపు దశలో ఎండిపోయింది. సుమారు 5,6 లక్షల మేర అప్పులయ్యాయి. ఈ నేపథ్యంలో భార్యతో తరచూ చిన్న చిన్న ఘర్షణలు జరుగుతున్నాయి. అప్పుల భారం మూలాన భార్యా, పిల్లలను సక్రమంగా పోషించలేననే బాధతో మనస్తాపం చెంది గురువారం సాయంత్రం పత్తి చేనుకి వెళ్లి పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొత్తగూడెం వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. టేకులపల్లి పోలీసులు విచారణ చేస్తున్నారు.

అవమానం భరించలేక బాలిక ఆత్మహత్యాయత్నం

తిరుమలాయపాలెం, నవంబర్ 16: చెంపమీద కొట్టి తిట్టినందుకు అవమానం భరించలేక ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థిని ఇంట్లో ఉన్న గడ్డిమందు తాగి మేకలతండాలో గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మేకలతండాకు చెందిన బానోత్ సుజాత చిన్నకూతురు ఉష ఖమ్మం ప్రభుత్వ మహిళాకళాశాలలో ఇంటర్ చదువుతోంది. అయితే ఉషను అదే తండాకు చెందిన బానోత్ గణేష్‌కు ఇచ్చి వివాహం చేద్దామని అనుకున్నారు. అనివార్య కారణాలతో రద్దు అయింది. తల్లి సుజాత హైదరాబాద్‌లో బి.టెక్ చదువుతున్న పెద్దకూతురు శిరీష వద్దకు వెళ్ళింది. తిరిగి తండాకు చేరుకున్న సుజాత చిన్న కూతురు ఉష అపస్మారక స్థితిలో ఉండగా ఆమెను ఏం జరిగిందని ప్రశ్నించింది. గణేష్ అతని సోదరుడు రమేష్ ఇంటికి వచ్చి బయటకు లాగి చెంపమీద కొట్టారని, తనను ఎందుకు పెండ్లి చేసుకోవని కొట్టి దుర్భాలాషలాడారని చెప్పి బావురుమంది. అపస్మరాక స్థితిలో ఉన్న ఉషను వైద్య నిమిత్తం ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. జరిగిన సంఘటనపై సుజాత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ పంజాల సర్వయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.