క్రైమ్/లీగల్

నేత కార్మికుడు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 16: కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అప్పుల బాధతో నేత కార్మికుడు గోశికొండ రాంప్రసాద్(52) బలవన్మరణం చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక గాంధీనగర్‌లోని ఆయన కార్కాణాలోనే బతుకమ్మ చీరెలు నేస్తున్న మరమగ్గాల మద్యనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడు సాంచాలు(మరమగ్గాలు) ఉన్న రాంప్రసాద్ వాటిపైనే వస్త్ర ఉత్పత్తులు చేస్తున్నాడు. కొద్ది రోజులుగా నేసిన బతుకమ్మ చీరెలను ఈనెల 10 వరకు అప్పగించాడు. మరో మూడు మగ్గాలపై చీరెలు నేస్తున్నాడు. రాంప్రసాద్ ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యల కారణాలు, వరకట్నం కారణంగా కూతురు పెళ్ళి కుదురకపోవడం మొదలైన సమస్యలతో ఇంటిలో గొడవలకు దారి తీయడంతో ఆయన మనస్థాపానికి గురై తాను బతుకమ్మ చీరెలు ఉత్పత్తి చేస్తున్న పవర్‌లూంల మద్యే ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాంప్రసాద్‌కు భార్య, ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉండగా, భార్య రూప బీడీలు చుడుతుండగా, పెద్ద కూతురు ఎంబీఏ, రెండో కూతురు గీత పాలిటెక్నిక్, చిన్న కూతురు ఆలేఖ్య 6వ తరగతి చదువుతున్నది. కుమారుడు సాయి 10వ తరగతి చదువుతున్నాడు. ఇది ఇలా ఉండగా పెద్ద కూతురుకు కొంత కాలంగా పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. మంచి సంబంధం వచ్చినపుడు వరకట్నం ఎక్కువ ఇచ్చుకోలేక పోవడం, పేద సంబంధాలు వస్తే దానికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఏడాదిన్న కాలంగా ఇంటిలో భార్యా భర్తల మద్య గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. దానికి తోడు కుటుంబ భారం, ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు, కూతురు వివాహం కుదురకపోవడంతో మనస్థాపానికి గురైన రాంప్రసాద్ శుక్రవారం తన మరమగ్గాల మద్యకు వెళ్ళి తలుపులు, గడియ వేసుకుని వాటి మద్యే ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి ఉరి నుండి విడదీసి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే రాంప్రసాద్ మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. కాగా ఈ సంఘటనపై జిల్లా చేనేత జౌళి శాఖ సహయ సంచాలకుడు వి.అశోక్‌రావు ఆసుపత్రి వద్దకు వచ్చి నేత కార్మికుడి మృతిపై విచారణ జరిపారు. రాంప్రసాద్ ఈనెల 10 వరకు బతుకమ్మ చీరెలు నేసి అప్పగించాడని, ఇంకా మూడు మరమగ్గాలపై చీరెలు నడుపుతన్నాడని, ఇతడికి ఎలాంటి ఉపాధి సమస్య లేదని పేర్కొన్నారు. అలాగే పెళ్ళికాని ముగ్గురు కూతుర్లు ఉండగా కూతురి వివాహ సమస్య, భార్యకు కడుపునొప్పితో ఆరోగ్య సమస్యలతో బాథ పడుతున్నాడన్నారు. తాను స్వయంగా వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడినట్టు చేనేత జౌళి శాఖ ఎడీ అశోక్‌రావు ప్రభుత్వానికి నివేదించాడు. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.