క్రైమ్/లీగల్

శ్రీనివాసన్ పిటీషన్‌పై తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 5: అక్రమ పెట్టుబడుల కేసులో సిబిఐ కోర్టు ముందు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలన్న ఇండియా సిమ్మెంట్స్ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ పిటీషన్‌పై తీర్పును హైకోర్టు సోమవారం నాడు రిజర్వులో ఉంచింది.
దసపల్లా భూమి రిజస్ట్రేషన్ సస్పెన్షన్
విశాఖపట్టణంలోని దసపల్లా ప్రాంతంలోని భూమిని పిటీషనర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన బెంచ్ సస్పెండ్ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి తీర్పుపై ప్రభుత్వం బెంచ్ ముందు అప్పీలు చేయగా, వెంటనే ప్రభుత్వం తమ వాదనలను సింగిల్ జడ్జి ముందుంచాలని బెంచ్ ఆదేశించింది.
ఆస్తుల పత్రాలు ఇవ్వండి
అగ్రి గోల్డ్ సంస్థ తమ ఆస్తుల పత్రాలను, వివరాలను సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ జీ గ్రూప్‌నకు అందజేయాలని జస్టిస్ వి రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్ వి భట్‌ల నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది.