క్రైమ్/లీగల్

రూ.12.85 లక్షల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, నవంబర్ 16: ఎన్నికల నియమావళిలో భాగంగా శుక్రవారం కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలలో రూ.12.85 లక్షలు పట్టుబడినట్లు నగర పోలీస్ కమీషనర్ వి.బి.కమలాసన్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ పట్టణంలో ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిపోతున్న రూ.9.63 లక్షలు, కరీంనగర్ రూరల్ పోలీసుల తనిఖీల్లో రూ.1.5 లక్షలు, కొత్తపల్లి పోలీసులు రూ.1.72 లక్షలను పట్టుకున్నట్లు వివరించారు. కరీంనగర్ వన్ టౌన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వ్యక్తులపై కేసులు నమోదు చేశామని, పోలీస్ అంబులెన్స్ తనిఖీలు విస్తారంగా నిర్వహించగా ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.12.85 లక్షలు పట్టుబడ్డాయని ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని, చట్టవిరుద్ధంగా డబ్బులు తరలించుకుపోతుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు భారీ మొత్తంలో తరలించుకుపోతున్నట్లు అందిన సమాచారం మేరకే విస్తృత తనిఖీలు నిర్వహించగా ఇంత పెద్దమొత్తంలో నగదు పట్టుబడినట్లు కమీషనర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు. ఈ డబ్బులకు సంబంధించి ఎలాంటి రశీదులు ఉన్నా చూపించినట్లయితే డబ్బులను పొందేందుకు వీలుంటుందని తెలిపారు.