క్రైమ్/లీగల్

ఎంపీటీసీ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాటారం, మార్చి 5: మహాముత్తారం మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మండల కేంద్రం ఎంపీటీసీ మార్క రాముగౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి ఈ విషయాన్ని కాటారం డీఎస్పీ కేఆర్‌కే ప్రసాదరావు ధ్రువీకరించారు. మహాముత్తారం మండల కేంద్రానికి చెందిన జాడి కవిరాజు మృతికి కారకుడిగా మార్క రాముగౌడ్‌ను పేర్కొంటూ దళిత సంఘాలు సోమవారం కాటారం మండల కేంద్రమైన గారెపల్లిలో భారీ ఎత్తున ధర్నాతో పాటు మృత దేహంతో నడిరోడ్డుపై బైఠాయించారు. కులం పేరుతో దూషించి, చంపుతానని బెదిరించిన సందర్భంలో కవిరాజు కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. కాగా, తాజాగా రాముగౌడ్ అరెస్ట్‌తో నలుగురు కూడా ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. సాయంత్రం లోగా రాముగౌడ్‌ను అరెస్ట్ చేస్తామని కాటారం డీఎస్పీ ప్రసాదరావు ఆందోళనకారులకు ఇచ్చిన హామీ మేరకు సోమవారం రాత్రి రాముగౌడ్‌ను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిని పోలీసులు ధ్రువీకరించారు. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను చేపడుతామని కాటారం డీఎస్పీ ప్రసాదరావు తెలిపారు.