క్రైమ్/లీగల్

అంతారంలో ఇద్దరు అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తలకొండపల్లి, నవంబర్ 17: తలకొండపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంతారం గ్రామంలో అనుమానాస్పదంగా ఇద్దరు మరణించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. భైరపాక సంతోష(20)లు అనే అవివాహిత మహిళ శుక్రవారం రాత్రి తన ఇంట్లో చున్నీతో ఫ్యాన్‌కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక ఎస్‌ఐ సురేష్ యాదవ్ కథనం ప్రకారం... భైరపాక బాలయ్య,మైసమ్మలకు ఏడుగురు ఆడ సంతానం, తండ్రి చాలా రోజుల క్రితం మరణించినట్లు పెర్కొన్నారు. మృతురాలు ఆమనగల్లు కాటన్‌మిల్‌లో పని చేసుకుంటూ ఉండేదని, శుక్రవారం అంతారం గ్రామానికి వెళ్లి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి జీవితంపై విరక్తీ పొందిన సంతోష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు పేర్కొన్నారు. సంతోష ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో తల్లి మైసమ్మ పెద్ద కూతురు దగ్గరకు గంగపురం గ్రామానికి వెల్లిందని తెలిపారు. ఆదే విధంగా కావలి కృష్ణయ్య (49) అనే రైతు శుక్రవారం అర్ధరాత్రి అనుమానస్పదంగా మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో పోలానికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి శనివారం ఉదయం పోలం వద్దకు వెళ్లి చూడగా గడ్డివాము దగ్గర మృతి చెంది ఉన్నట్టు కొడుకు రమేష్ తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. కృష్ణయ్య పై ఎలాంటి గాయా లు లేక పోవడంతో గుండె పోటుకు గురై మృతి చెంది ఉంటాడని పోలీసు లు భావిస్తున్నారు. కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు భార్య బీమమ్మ ఉన్నారు. ఇద్దరి మృతదేహాలను తలకొండపల్లి పోలీసులు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేష్‌యాదవ్ సూచించారు.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం
మండలంలోని అంతారం గ్రామం లో అనుమానస్పదంగా మృతి చెందిన సంతోష కుటుంబాన్ని రెండు వేల రూపాయలు, కృష్ణయ్య కుటుంబ సభ్యలకు మూడు వేల రూపాయలు ఆర్థిక సహయాన్ని తలకొండపల్లి మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సీఎల్ శ్రీనివాస్ యాదవ్, జడ్పీటీసీ నర్సీంహలు అందించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వపరంగా వారి కుటుంబాలకు అందవలసిన పథకాలను అందిస్తామని పెర్కొన్నారు.