క్రైమ్/లీగల్

జల్సాలకు అలవాటు పడి... మల్టీలెవల్ మోసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, నవంబర్ 17: జల్సాలకు అలవాటు పడి ఇంజనీరింగ్ విద్యను మధ్యలో అపివేసి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాధించడం కోసం మాల్టీలెవల్ మార్కెట్ సంస్థలో పని చేశారు. ఖారంగ్‌పూర్ ఐఐటీ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే అపివేసి సోంతంగా గొలుసుకట్టు సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. నాలుగు వేలు చేల్లించి తమ సంస్థలో సభ్యులుగా చేరి మరో ఇద్దర్ని చేరిస్తే సంవత్సరంలో కోటికిపైగా సంపాదించుకోవచ్చని నిరుద్యోగులను మోసం చేస్తున్నా బోగస్ ప్రోహెల్తీవేజ్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన తోమ్మి మంది డైరెక్టర్లును సైబరాబాద్ ఎకామిక్ ఆఫెన్స్‌స్ వింగ్ అరెస్టు చేసింది. సంస్థ ఖాతాలో ఉన్న 40లక్షల రూపాయలను సీజ్ చేయడంతో పాటు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ నిందితుల వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన మహమ్మద్ రిజ్వన్ (23) బత్తు సాయికొండ హర్షవర్ధన్ (27) మహ్మద్ ఇస్కా (61) అలూరి నరేష్ (27) పప్పల సాయి చరణ్ (24)వేణు నాయక్ (26) సత్యమణికంఠ (24) అనిల్ కుమార్ (26) కొండ శ్రీనివాసులతో పాటు మరికొందరు ప్రోహెల్తీ వేజ్ ఇంటర్నేషనల్ పేరుతో నకిలీ సంస్థను ఏర్పాటు చేశారు. నాలుగు వేల రూపాయలు చేల్లించి సంస్థలో సభ్యులకు నకిలీ హెల్త్ ప్రొడెక్టులు ఇచ్చేవారు. సభ్యులుగా చేరిన వారు మరో ఇద్దరిని చేర్పించాలని సంస్థలో ఉత్సహాంగా పని చేస్తే ఎడాదిలో కోటీశ్వరులు అవుతారని నిరుద్యోగులను నమ్మించేవారని చెప్పారు. మల్టీలెవల్ మార్కెటింగ్‌లో చేరిన వారికి ఆయుర్వేద, యునాని హెల్త్ ప్రొడెక్టుల పేర్లతో మోసాలకు పాల్పడుతున్నారని సీపీ తెలిపారు. ముఠా అమ్ముతున్న ఉత్పత్తులకు ఎలాంటి అనుమతులు లేవని చెప్పా రు. గొలుసుకట్టు విధానంలో కస్టమర్లను చేర్పించి మోసాలు చేస్తున్నారని ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ కోరారు. నిందితులను అరెస్టు చేసి ఈఓడబ్ల్యూ విభాగం అధికారుల ను సిబ్బందిని సీపీ అభినందించారు. ఈఓడబ్ల్యూ డీసీపీ విజయ్ కుమార్, ఏడీసీపీ ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.