క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామగిరి, నవంబర్ 17 : మండలంలోని రామగిరికి సమీపంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. పోలేపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్ (17) ట్రాక్టర్‌లో విద్యుత్ స్తంభాలు వేసుకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో విద్యుత్ స్తంభాలు అతడికి తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుని కుటుంబానికి స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె గ్రామానికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటానని తెలిపారు.
చికిత్స పొందుతూ చిన్నారి మృతి
బత్తలపల్లి, నవంబర్ 17 : కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన చిన్నారి శనివారం మృతి చెందింది. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన సమాచారం మేరకు మండలంలోని జలాలపురం గ్రామంలో శ్రీనివాసులు, శిరీషతోపాటు కుమార్తె కీర్తన గురువారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కీర్తన (8) శనివారం మృతి చెందింది. తనకల్లులోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. ఇదే కుటుంబంలో గత రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి 6వ తరగతి చదువుతున్న ఉమేష్‌చంద్ర మృతి చెందిన విషయం తెలిసిందే. ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులందరూ గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. శ్రీనివాసులు, కీర్తన బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతుండగా శిరీష అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వీరిలో కీర్తన మృతి చెందడంతో శ్రీనివాసులు కుటుంబంలో కుమార్తె, కుమారుడు మృతి చెందారు. అయితే బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులు, అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శిరీషల పరిస్థితి కూడా విషమంగా ఉందని ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. అయితే కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడగా వీరెందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియడం లేదు. వీరు కోలుకుంటే ఆత్మహత్యకు గల కారణాలు తెలియవచ్చు.
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే గోనుగుంట్ల
మండలంలోని జలాలపురం గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన శ్రీనివాసులును స్థానిక ఆర్డీటీ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుండగా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ శనివారం రాత్రి పరామర్శించారు. ఆర్డీటీ వైద్యులను, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీటీ ఆసుపత్రి వద్ద వున్న కుటుంబ సభ్యులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుత్తి, నవంబర్ 17 : పోలీసుల వేధింపులను భరించలేక స్టేషన్ ముందు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ లారీ డ్రైవర్ రామాంజినేయులు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కల్లూరు గ్రామానికి చెందిన రామాంజినేయులు పట్టణంలోని చెర్లోపల్లి కాలనీలో రెండవ భార్య రేవతితో నెలకొన్న మనస్పర్థలు కారణంగా తరచు గొడవ పడుతుండే వారు. ఇదేక్రమంలో గురువారం రాత్రి బాధితురాలు రేవతి ఫిర్యాదు మేరకు ఎస్సై యువరాజ్ రామాంజినేయులును స్టేషన్‌కు పిలిపించి రాత్రి వరకూ తనదైన శైలిలో కౌనె్సలింగ్ ఇచ్చాడు. దీంతో భయాందోళనకు గురైన కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు బాధితుడు మరణ వాంగ్మూలంలో పేర్కొన్నాడు. శవాన్ని స్వగ్రామం కల్లూరుకు తరలించారు.