క్రైమ్/లీగల్

వృద్ధుల సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, నవంబర్ 19: ప్రమాదవశాత్తు వృద్ధులు దహనమైన సంఘటన ఆదివారం రాత్రి నెల్లూరు జిల్లా గూడూరు మండల పరిధిలోని చవటపాళెం గిరిజన కాలనీలో చోటు చేసుకుంది. సోమవారం స్థానికులు ఫిర్యాదు మేరకు గూడూరు రూరల్ ఎస్సై బాబి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లాకు చెందిన తిరుమలశెట్టి రంగారెడ్డి అలియాస్ రంగయ్య అలియాస్ తిరుపతయ్య (85) అనే వృద్ధుడు తిరుపతికి చెందిన తిరుమలశెట్టి సుబ్బమ్మ (75)తో సహజీవనం చేస్తూ గత 20 సంవత్సరాల క్రితం చవటపాళెంలోని గిరిజన కాలనీ వద్ద ఓ గృహం నిర్మించుకుని అందులో జీవిస్తున్నారు. ఇద్దరూ బొగ్గుల బట్టీలో బొగ్గులు అమ్ముకుని జీవిస్తున్నారు. సుబ్బమ్మకు గతంలో తిరుమలశెట్టి మునుస్వామి అనే వ్యక్తితో వివాహం జరిగి కుమారుడు శ్రీనివాసులు ఉన్నారు. మునుస్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ మృతిచెందారు. ఈ నేపధ్యంలో భర్త పెన్షన్ సొమ్ముతో రంగయ్యతో సుబ్బమ్మ సహజీవనం చేస్తూ కాలం వెళ్లబుచ్చుతోంది. అయితే రంగయ్య, సుబ్బమ్మ మద్యంకు బానిసలయ్యారు. ఈ మధ్యకాలంలో సుబ్బమ్మ ప్రమాదవశాత్తు జారిపడి గాయపడింది. అప్పటి నుంచి సుబ్బమ్మ పెన్షన్ సొమ్ముతో నిత్యం మద్యం ఇంటికి తీసుకొచ్చి ఇద్దరూ తాగేవారు. గత ఆరు నెలల నుంచి గృహానికి కూడా కరెంటు తొలగించారు. దీంతో వీరిద్దరూ రాత్రివేళల్లో కొవ్వొత్తి వెలిగించుకునేవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదివారం రాత్రి కూడా ఇద్దరూ మద్యం సేవించి రంగయ్య నులకమంచం మీద, సుబ్బమ్మ మంచం కింద నిద్రకు ఉపక్రమించారు. ఈ పరిస్థితుల్లో పక్కనే కేండిల్‌ను, జెట్ బిళ్లలను వెలిగించుకున్నారు.
వీరి చుట్టుప్రక్కల పాత గుడ్డలు, చెత్త కాగితాలు పడి ఉండటంతో ప్రమాదవశాత్తు వాటికి నిప్పంటుకుని ఇద్దరు కూడా సజీవ దహనమయ్యారు. స్థానికులు ఫిర్యాదు మేరకు సుబ్బమ్మ కుమారుడు శ్రీనివాసరావుకు సమాచారం అందించి కేసు నమోదు చేశారు.

ఈ మేరకు పోలీసులు మృతదేహాలను శవ పంచనామా కోసం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు విచారణ చేపట్టారు.