క్రైమ్/లీగల్

మహారాష్ట్ర ఆర్డినెన్సు డిపోలో పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వార్ధా (మహరాష్ట్ర), నవంబర్ 20: మహారాష్టల్రోని వార్ధా జిల్లాలో మంగళవారం ఒక ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో జరిగిన పేలుళ్ల ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించారు. పది మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు ఉదయం 7 గంటల నుంచి 7.15 గంటల మధ్య సంభవించాయి. కేంద్ర ఆయుధ గిడ్డంగిలో పేలుళ్లు జరిగాయి. వార్ధా జిల్లాలో పుల్గాన్ పట్టణంలోని ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో ఈ దుర్ఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన ప్రదేశంలో 10 నుంచి 15 మంది కార్మకులు పనిచేస్తున్నారు. పేలుడు పదార్థాలను అన్‌లోడింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అదనపు ఎస్పీ నిఖిల్ పింగళే చెప్పారు. నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు వ్యక్తులు ఆసుపత్రిలో మరణించినట్లు పోలీస్ ఐజీ కేఎంఎం ప్రసన్న చెప్పారు. ఈ ఆయుధాలను నిర్వీర్యం చేసేందుకు ఆర్డినెన్సు ఫ్యాక్టరీ కాంట్రాక్టు ఏజన్సీకి అప్పగించింది. ఒక మైదానంలో గోతులు తవ్వి అందులో ఆయుధాలను పెట్టి ఇసుకతో కప్పెట్టాలి. ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్పించామని, అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. ఇదే ఫ్యాక్టరీలో 2016లో జరిగిన ఇదే తరహా పేలుళ్ల ఘటనలో 16 మంది మరణించారు.