క్రైమ్/లీగల్

లొంగిపోయన బిహార్ మాజీ మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెగుసరాయి (బిహార్), నవంబర్ 20: ముజఫర్‌పూర్ శరాణాలయం కేసులో తప్పించుకుని తిరుగుతున్న బిహార్ మాజీ మంత్రి మంజు వర్మ మంగళవారం స్థానిక కోర్టులో లొంగిపోయారు. కోర్టు ఆమెను డిసెంబర్ ఒకటి వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. శరణాలయాల పేరిట బాలికలపై అకృత్యాలకు పాల్పడిన సంఘటనలు ఈ ఏడాది ఆగస్టులో వెలుగులోకి వచ్చి రాష్టవ్య్రాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో బిహార్ మంత్రిగా ఉన్న మంజూ వర్మ భర్త చంద్రశేఖర్ వర్మను నిందితునిగా పోలీసులు గుర్తించారు. ఆయన ఇంటిపై సీబీఐ జరిపిన దాడిలో పెద్దమొత్తంలో ఆయుధాలు సైతం లభించాయి. వర్మ అక్టోబర్ 29న కోర్టులో లొంగిపోయాడు. తర్వాత ఈ కేసుకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి మంజువర్మ తన పదవికి రాజీనామా చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమె ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు రాగా, కేసు నమోదు చేయగా, అప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారు. కేసును విచారించిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ప్రభాత్ త్రివేది ఆమెను వైద్య పరీక్షలకు పంపాలని చెప్పారు. తర్వాత ఆమెను డిసెంబర్ ఒకటి వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేశారు.