క్రైమ్/లీగల్

మైనర్ ప్రేమ జంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిలకలూరిపేట, మార్చి 3: బావిలో దూకి ఓ మైనర్ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. చిలకలూరిపేట అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేదరమెట్ల గ్రామంలో నివశించే షేక్ జాఫర్, లాలూబీల కుమారుడు షేక్ బాషా (17) గత మూడు సంవత్సరాలుగా చిలకలూరిపేట విశ్వనాథ్ థియేటర్ వెనుక ఉన్న వెల్డింగ్ షాపులో పని నేర్చుకుంటున్నాడు. అక్కడ సమీపాన నివశించే అన్నపురెడ్డి హరినారాయణ, శివనాగేంద్రమ్మల పెద్ద కుమార్తె హైమావతి (16) 8వ తరగతి చదివి ఖాళీగా ఉంటుంది. బాషా, హైమావతిలు ప్రేమించుకుని తమ ప్రేమను తల్లిదండ్రులకు చెప్తే ఒప్పుకోరేమోనని గత ఆదివారం ఇంటి నుండి వెళ్లిపోయారు. బాషా స్నేహితుడి ద్వారా వాకబు చేయగా హైదరాబాద్‌కు వెళ్లారని తెలిపారు. మంగళవారం సుమారు 11 గంటల సమయంలో విశ్వనాథ్ థియేటర్ వెనుక ఉన్న పాడుబడిన బావిలో ఇద్దరి మృతదేహాలు తేలియాడుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న అర్బన్ సిఐ సురేష్‌బాబు, సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సిబ్బంది సాయంతో మృతదేహలను వెలికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.