క్రైమ్/లీగల్

రైలు కింద పడి ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓదెల, మార్చి 6: మండలంలోని ఉప్పరపల్లి గ్రామ 33 రైల్వే గేటు వద్ద రైలు కింద పడి మ్యాకల కుమార్ (24) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం..మృతుడి అన్నయ్యకు ఆదివారం పెళ్లి జరుగగా, సోమవారం ఇంటి వద్దనే పెళ్లి విందు జరుగుతుండగా రైలు కింద పడి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు గతంలో సుల్తానాబాద్ మండలం ఒక రైస్‌మిల్ ఓనర్‌ను చంపిన నిందితుడిగా స్థానికులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.

గుట్కా ప్యాకెట్లు పట్టివేత
కోనరావుపేట, మార్చి 6: కోనరావుపేట మండల కేంద్రంలో నిషేదిత గుట్కాలను పోలీసులు పట్టుకున్నారు. మండల కేంద్రంలోని వ్యాపారి దొంతుల రాజు గుట్కా ప్యాకెట్లను గుట్టు చప్పుడు కాకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వ్యాపారం చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఇతడి హన్మాన్ దుకాణంలో దాడి చేయడంతో రూ.21 వేల విలువ గల 7200 నిషేదిత అంబర్ ప్యాకెట్లను స్వాథీనం చేసుకున్నారు. నిందితుడు రాజును కోనరావుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో టాస్క్ఫోర్స్ సీఐ బన్సీలాల్, సిబ్బంది పాల్గొన్నారు.