క్రైమ్/లీగల్

ఎంపీటీసీపై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, మార్చి 6: చందుర్తి మండలం జోగాపూర్ ఎంపీటీసీ వట్టెంల కనుకయ్య (40)పై ఇదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ ఎం.డి.సలీం, మరో వ్యక్తి గొల్లపల్లి శంకర్ సోమవారం అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. సోమవారం రాత్రి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం జరుగగా కార్యక్రమంలో పాల్గొని రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న కనుకయ్యపై పథకం ప్రకారం సలీం, శంకర్‌లు కత్తితో దాడి చేయగా కడుపులో గాయాలయ్యాయి. వెంటనే కనుకయ్య ద్విచక్ర వాహనాన్ని వదిలి పరుగెత్తగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. భూ తగాదాలతోనే ఈ దాడి జరిగినట్లు గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఎంపీటీసీ కనుకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సలీం, శంకర్‌తో పాటు మరో వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లేశం గౌడ్ తెలిపారు.