క్రైమ్/లీగల్

హత్యకేసులో నిందితుల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, మార్చి 6: చందుర్తి మండలం రామరావుపల్లి గ్రామానికి చెందిన లింగంపల్లి లింగయ్య (50) అనే వ్యక్తిని ఈ నెల 2వ తేదీన గొడ్డలి, కర్రలతో దాడి చేసి హత్య చేసిన నిందితులను మంగళవారం వేములవాడ డీఎస్పీ అవదాని చంద్రశేఖర్ అరెస్ట్ చేసి వివరాలను వెల్లడించారు. లింగయ్య కుమారుడు అనీల్ ఇదే గ్రామానికి చెందిన లింగంపల్లి రాజయ్య కూతురు ప్రియాంకను ప్రేమ పెళ్లి చేసుకోగా, రెండు కుటుంబాల మధ్య విబేధాలు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో కక్ష పెంచుకున్న లింగంపల్లి రాజయ్య, అతని కుమారుడు వెంకటేష్, భార్య రాజవ్వ, కూతురు రవళి పథకం ప్రకారం గొడ్డలి, కర్రలతో లింగయ్యపై దాడి చేయగా మృతి చెందాడు. చందుర్తి ఎస్‌ఐ మల్లేశం గౌడ్ నాలుగు రోజుల్లో హత్యానిందితులను పట్టుకొని స్టేషన్‌కు తరలించగా నలుగురు నిందితులను డీఎస్పీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. హత్యా నిందితులను పట్టుకున్న సిఐ విజయ్ కుమార్, ఎస్‌ఐ మల్లేశం గౌడ్‌లను డిఎస్పీ అభినందించారు.