క్రైమ్/లీగల్

13వ అంతస్తు నుంచి కిందపడి ఇద్దరు కూలీల దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్సింగి, మార్చి 6: నిర్మాణంలో ఉన్న భవనం 13వ అంతస్తు పైనుంచి కిందపడి ఇద్దరు వలస కూలీలు దుర్మణం చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. విషాద సంఘటన కోకాపేట గ్రామంలో చోటుచేసుకుంది. నార్సింగి ఇన్‌స్పెక్టర్ రమణ గౌడ్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేటలో జీఏఆర్ కన్‌స్ట్రక్షన్స్ అపార్ట్‌మెంట్ నిర్మాణంలో ఉంది. ఈ భవనంలో పలు రాష్ట్రాలకు చెందిన కార్మికులు పని చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన తపాన్ బిశ్వాస్, రాణా మండల్, దీపక్ ప్రతిరోజు మాదిరిగానే మంగళవారం 13వ అంతస్తులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డారు. తపాన్ బిశ్వాస్, రాణా మండల్ ఇద్దరు అక్కడిక్కడే దుర్మరణం చెందగా, దీపక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీపక్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీపక్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.