క్రైమ్/లీగల్

బిల్డింగ్ పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, మార్చి 6: మీర్‌పేట్ టీకేఆర్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల రామకృష్ణాపురం గ్రామానికి చెందిన కందుల శంకరయ్య కుమారుడు విక్రమ్ టీకేఆర్ కళాశాలలో చదువుతున్నాడు. సోమవారం విక్రమ్ తన స్నేహితులతో కలిసి రాత్రి ఒంటిగంటకు పార్టీ చేసుకున్న అనంతరం స్నేహితులు అందరు వెళ్లిపోగా, విక్రమ్, స్నేహితుడు మధుకర్ బైక్ తీసుకొని మీర్‌పేట్ మణికంఠనగర్‌లో ఉండే మరో స్నేహితుడు అజయ్ దగ్గరకు వెళ్లాడు. అజయ్ మూడు అంతస్తుల పెంట్ హౌజ్‌లో నివాసం ఉంటున్నాడు. రాత్రి 3:30 గంటలకు తనతో రూమ్‌లో కలిసి ఉండే ప్రశాంత్‌కు చనిపోతున్నానని మేసేజ్ పెట్టి, బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.