క్రైమ్/లీగల్

కాశ్మీర్ అసెంబ్లీ రద్దుపై పిటిషన్ కొట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన ప్రజావ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి తాము జోక్యం చేసుకోదల్చుకోలేదని చీఫ్‌జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కె కౌల్‌లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. రద్దయిన అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న గగన్ భగత్ నవంబర్ 21న ప్రజలు ఎన్నుకున్న జమ్మూకాశ్మీర్ ప్రభుత్వాన్ని రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ రద్దు చేశారని, ఆయన నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకోవడానికి తమకు ఎంతమాత్రం ఆసక్తి లేదని పేర్కొంటూ భగత్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఇలావుండగా గత ఆరు నెలలుగా గవర్నర్ పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్‌లో ఆ పాలన డిసెంబర్ 18తో ముగియనుంది. వాస్తవానికి జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ పదవీకాలం అక్టోబర్ 2020 వరకు ఉన్న నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తమ పార్టీ ఎమ్మెల్యేలు 29మంది, తమకు మద్దతు ఇస్తున్న నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన 15మంది, కాంగ్రెస్‌కు చెందిన 12 మందితో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌కు లేఖరాసిన 24 గంటలు కూడా గడవక ముందే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం విమర్శలకు దారితీసింది.