క్రైమ్/లీగల్

కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, డిసెంబర్ 11: కుటుంబ కలహాలతో తల్లీబిడ్డ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల పరిధిలోని లక్ష్మీపురంలో మంగళవారం జరిగింది. కుప్పం ఎస్సై లోకేష్ కథనం ప్రకారం కర్నాటక రాష్ట్రం బుదికోట గ్రామానికి చెందిన వీణకు కుప్పం మండలం లక్ష్మీపురానికి చెందిన శివతో నాలుగేళ్ల కిందట వివాహం జరుగగా, వీరికి ఏడాది వయసు కలిగిన కొడుకు ఉన్నాడు. నాలుగు నెలలుగా భార్యభర్తల నడుమ తరుచూ చిన్నిచిన్న గోడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి అదృశ్యమైన శివ భార్య వీణ (24) ఏడాది కుమారుడు(1) మృతదేహాలు మంగళవారం సాయంత్రం లక్ష్మీపురం గ్రామసమీపంలోని చెరువులో కనిపించాయి. శివ మాత్రం గ్రామస్తులతో కలిసి భార్యాబిడ్డల కోసం సోమవారం రాత్రినుంచి నలుమూలల వెతుకుతున్నాడు. చివరకు భార్య, కుమారుడు శవాలై కనిపించడంతో శివతోపాటు సమీప బంధులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ మేరకు కేసు నమోదుచేసి పోస్టుమార్టం కోసం శవాలను కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.