క్రైమ్/లీగల్

రొయ్యల ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకరావుపేట, డిసెంబర్ 11: మండలంలో పాల్మాన్‌ఫేట సిరిమెరిన్ హాచరీస్‌లో రొయ్యిల ట్యాంక్‌ను పరిశీలిస్తుండగా పంపర బోయిన రాము(22) ట్యాంక్ తలకు ఢీ కొనడంతో చనిపోయినట్లు ఎస్సై ఎల్.రామకృష్ణ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పాల్మాన్‌పేట సిరిమెరిన్‌హాచరీస్‌లో రాము మూడు నెలలుగా పని చేస్తున్నాడన్నారు. పని ముగించుకుని ఇంటికి వెళ్ళే సమయంలో ట్యాంక్‌ను పరిశీలించేందుకు వెళ్ళి తిరిగి వచ్చే సమయంలో ట్యాంక్ ఢీ కొనడంతో తలకు బలమైన గాయమైంది. గాయపడిన రామును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తుండగా మరణించినట్లు ఆయన తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
పాయకరావుపేట, డిసెంబర్ 11: మండలంలో ఎం ఎస్‌పేట వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను సీజ్ చేసామని పాయకరావుపేట ఎస్సై ఎల్.రామకృష్ణ తెలిపారు. ఈసందర్భంగా ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ ఇసుక రవాణాకు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. ఈదాడిలో ఆయన తోపాటు కానిస్టేబుల్ ఉన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 8 మంది నిందితులకు జైలు,జరిమానా
సబ్బవరం, డిసెంబర్ 11 : మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారన్న అభియోగంపై స్థానిక పోలీసులు అరెస్టుచేసిన 8 మంది నిందితుల కేసులో నేరం రుజువుకావటంతో అనకాపల్లి సెకండ్ ఎంఎం కోర్టున్యాయమూర్తి జైలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పుచెప్పారు. ఈమేరకు స్థానిక ఎస్‌ఐ ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో సోమవారం స్థానిక పోలీసులు జాతీయ రహదారిపై నిర్వహించిన వాహనాల తనిఖీల్లో మద్యం సేవించి పట్టుబడిన నిందితుడు భీమవోలు అప్పారావు(32)కు 600 రూపాయల జరిమానావిధించారు. మరోనిందితుడు గొర్లి గణేష్ (32)కు 600, గవర బాలాజీ (32) కు 800, సాలాపు పరదేశి (45)కు 800, గాలిసోమరాజు (28) ఆటోడ్రైవరుకు 1500రూపాయల జరిమానాతోపాటు ఒక రోజు జైలుశిక్ష విధించారు. ఎల్లపు శ్రీనివాసరావు(36) 800, జెట్టిశ్రీనివాసరావు(35) 800, బొండతల్లిదేముడు (45)కు 1000 రూపాయల చొప్పున న్యాయమూర్తి గుప్తా జరిమానా విదించారని ఎస్‌ఐ ప్రభాకరరెడ్డి వివరించారు.