క్రైమ్/లీగల్

తెల్లవారు జామున స్కార్పియో బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం, డిసెంబర్ 11: మండలంలో గర్నికం గ్రామంలో మంగళవారం తెల్లవారు జామున స్కార్పియో వాహనం భీభత్సం సృష్టించింది. అదృష్టవశాత్తు ఈ సమయంలో రోడ్డుపై జన సంచారం లేకపోవడంతో ప్రాణనష్టం జరుగలేదు. వాహనంలో ఉన్న ప్రయాణీకులు సైతం సురక్షితంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి మాడుగుల మండలం వీరవల్లి ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో గర్నికం వద్ద అదుపు తప్పి విద్యుత్ స్థంభాన్ని బలంగా ఢీ కొంది. అంతటితో ఆగకుండా పర్లాంగు దూరంలో ఉన్న జి.నానిబాబు ఇంటి బాత్‌రూమ్‌ను ఢీ కొంది. దీంతో విద్యుత్ స్థంబాలు రెండు ముక్కలు కాగా, బాత్‌రూమ్ పూర్తిగా ధ్వంసమైంది. సంఘటనా స్థలంలో పక్కనే ఉన్న గ్రామస్తులు ప్రమాద విషయాన్ని విద్యుత్ సబ్ స్టేషన్‌కు తెలియజేయడంతో సరఫరా నిలిపివేసారు . దీంతో భారీ ప్రమాదం తప్పింది. వాహనంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు వేరొక ఆటోలో వీరవల్లి వెళ్ళిపోయారని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ఈవిషయమై ఎస్సై రామకృష్ణ మాట్లాడుతూ వాహనానికి సంబంధించి ఇంత వరకు డ్రైవర్ ఆచూకీ దొరకలేదని , విద్యుత్ అధికారులు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదన్నారు.