క్రైమ్/లీగల్

అయోధ్య.. భూవివాదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు గురువారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలో వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసును పూర్తిగా భూ వివాదంగానే పరిగణించి విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను గురువారం చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం గంటపాటు ఇరుపక్షాల వాదనలను విన్నది. అలాగే ఈ కేసును ప్రస్తుతం రోజువారీగా విచారించాలనుకోవడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఉభయపక్షాల న్యాయవాదుల మధ్య వాడీవేడీగా వాదనాలు సాగాయి. కాగా అలహాబాద్ హైకోర్టులో దాఖలైన కేసులోని పిటిషనర్ల వాదనలు మాత్రమే ఇప్పుడు వింటామని, ఈ కేసులో కొత్తగా చేరాలనుకుంటున్న పిటిషనర్లు మరికొంత కాలం వేచి ఉండాలని స్పష్టం చేసింది. అయోధ్య వివాదంపై 2010లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన తీర్పుపై దాఖలైన సివిల్ అప్పీళ్లను ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన
ప్రత్యేక బెంచ్ విచారణ చేపట్టింది. కాగా గురువారం నాడు ఇరుపక్షాల వాదనలను ఆలకించింది. అలాగే ‘టైటిల్ సూట్’లో అసలు వాదప్రతివాదులు హైకోర్టులో సమర్పించిన దస్త్రాలు, పుస్తకాలు, ఎగ్జిబిట్‌లలో స్థానిక భాషలలో ఉన్న అంశాలను ఆంగ్లంలోకి తర్జుమా చేసి పదిహేనురోజుల్లో అత్యున్నత న్యాయస్థానానికి నివేదించాలని జస్టిస్ దీపక్ మిశ్రా ఇరుపక్షాలను ఆదేశించారు. అలహాబాద్ హైకోర్టులో ఈ కేసు విచారణ సందర్భంగా 524 ఆధారాలను సమర్పించారు. వీటిలో 504 ఆధారపత్రాలు, రామాయణం, రామచరితమానస్, శ్రీమద్‌భగవద్గీత వంటి 20 పుస్తకాలు, భారతీయ పురావస్తు శాఖ నివేదిక ఉన్నాయి. కాగా ఈ కేసులో సినీప్రముఖులు శ్యాంబెనగల్, రచయిత కిరణ్ నగార్కర్, సీనియర్ డ్వకేట్ చిరాగ్ ఉదయ్ సింగ్ సహా మరికొందరు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యేందుకు సిద్ధపడగా కోర్టు వారిని ఈ కేసులో చేర్చడానికి ఇప్పుడు సాధ్యం కాదని చెప్పింది.