క్రైమ్/లీగల్

నివేదికలోని అంశాలను సభ్యులతో పంచుకున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: గుజరాత్ నకిలీ ఎన్‌కౌంటర్ల కేసును విచారించిన సుప్రీంకోర్టు మాజీ జడ్జి తన నివేదికను ప్యానెల్‌లోని ఇతర సభ్యులతో పంచుకున్న విషయమై తెలియచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2002 నుంచి 2006 మధ్య గుజరాత్ ఎన్‌కౌంటర్లపై జస్టిస్ హెచ్‌ఎస్ బేడీ అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీ విచారించింది. 2002 నుంచి 2006 వరకు 26 నకిలీ ఎన్ కౌంటర్లని వచ్చిన అభియోగాలపై విచారణపై ఈ కమిటీ విచారించింది. ఈ కమిటీ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కోర్టుకు నివేదిక ఇచ్చింది. ప్రధానన్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్, కేఎం జోసెఫ్‌తో కూడిన ధర్మాసనం ఈ నివేదికను బహిర్గతం చేయాలని దాఖలైన పిటిషన్‌ను విచారించింది. గుజరాత్ ప్రభుత్వం ఈ నివేదికను బహిర్గతం చేయాలన్న డిమాండ్‌ను వ్యతిరేకించింది. పర్యవేక్షణ కమిటీ సభ్యులతో కలిసి చర్చించిన అంశాలను ఈ నివేదికలో ప్రస్తావించారా లేక తన అభిప్రాయాలను మాత్రమే పేర్కొన్నారా అనే విషయం తెలియనందు వల్ల ఈ నివేదికను బహిర్గతం చేయరాదని గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. వీలైనంత త్వరలో రిటైర్డు జడ్జి జస్టిస్ బేడీ తన అభిప్రాయాలను ఈ విషయమై తెలియచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. 2007లో బీజీ వర్గీస్, కవి జావేద్ అక్తర్ దాఖలు చేసిన పిల్‌ను సుప్రీంకోర్టు విచారించింది. సీబీఐ చేత ఎన్‌కౌంటర్ల కేసును విచారించాలని వారు కోర్టును కోరారు. ఈ కేసు విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ ప్యానెల్‌లో ఇతర సభ్యులను సంప్రదించకుండా నివేదిక ఇచ్చారని కోర్టుకు తెలిపారు.