క్రైమ్/లీగల్

జంట హత్యలపై ఎన్.ఐ.ఎ. దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, అరకులోయ, డిసెంబర్ 15: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఎ.) విచారణ చేపట్టనుంది. ఈ సంఘటనపై ఎన్.ఐ.ఎ.తో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించి సమగ్ర విచారణకు అప్పగించినట్టు తెలుస్తోంది. అరకులోయ ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమలను మావోయిస్టులు సెప్టెంబర్ 23వ తేదిన హత్య చేసిన సంగతి తెలిసిందే. డుంబ్రిగుడ మండలంలో గ్రామ దర్శిని కార్యక్రమానికి వీరిద్దరు నేతలు వెళుతుండగా లివిటిపుట్టు గ్రామం వద్ద మావోయిస్టులు వీరిని అదుపులోకి తీసుకుని హత్య చేయడం ప్రభుత్వ యంత్రాంగాన్ని నివ్వేరపరిచింది. ఈ సంఘటన అప్పటిలో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించగా మావోయిస్టుల ఘాతుకంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. దీంతో నేతల జంట హత్యలపై విచారణకు సిట్ బృందాన్ని నియమించి సీనియర్ ఐ.పి.ఎస్. అధికారి ఫకీరప్ప ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యలపై సిట్ బృందం అరకులోయలో మకాం వేసి ముమ్మర దర్యాప్తు నిర్వహించగా ఈ సంఘటనతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేసారు. అయితే సిట్ బృందం నిర్వహించిన విచారణ తీరుపై ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్టు చెబుతున్నారు. నేతల జంట హత్య సంఘటనపై సిట్ చేసిన విచారణ పారదర్శకంగా లేదని, ఈ బృందం దర్యాప్తులో కూడా పలు అనుమానాలు ఉన్నట్టు ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో సిట్ దర్యాప్తును పక్కనపెట్టి ఎన్.ఐ.ఎ.తో విచారణ చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ కేసును వారికి అప్పగించినట్టు చెబుతున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమల హత్య ఘటనపై ఎన్.ఐ.ఎ. మరికొద్ది రోజులలోనే విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది. జాతీయ దర్యాప్తు సంస్థలోని ఎస్.పి. కేడర్ అధికారి ఈ సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. నేతల హత్య సంఘటనపై ఇప్పటికే ఎన్.ఐ.ఎ. అధికారులు ప్రాధమిక సమాచారాన్ని సేకరించినట్టు తెలిసింది. త్వరలోనే వీరు అరకులోయ ప్రాంతంలో పర్యటించి నేతల హత్యలపై లోతుగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలుస్తోంది.