క్రైమ్/లీగల్

బైక్‌ల చోరీ కేసులో నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), డిసెంబర్ 15: మోటారు వాహనాల చోరీ కేసులో నలుగురిని పెనమలూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.35లక్షలు విలువైన చోరీ సొత్తు రికవరీ చేసినట్లు డీసీపీ డాక్టర్ గజరావు భూపాల్ తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన ఆటోడ్రైవర్ మారం నాగదుర్గారావు (20), తోపుడు బండిపై నూడిల్స్ వ్యాపారం నిర్వహించే తాడిగడపకు చెందిన సుద్దపల్లి అఖిల్ (23), యనమలకుదురుకు చెందిన మరో ఆటోడ్రవర్ షేక్ అజీజ్ (23), వరంగల్ జిల్లాకు చెందిన ఆటోడ్రైవర్ దారావత్ శ్రీనివాస్ (20)లు స్నేహితులు. ఈనలుగురూ తమ వృత్తులతోపాటు నేరాలను ప్రవృత్తిగా మార్చుకుని దొంగతనాలకు తెర తీశారు. ఈక్రమంలో రాత్రివేళల్లో పార్కింగ్ చేసిన మోటారు వాహనాలను అపహరించడం ప్రారంభించారు. పెనమలూరు పోలీస్టేషన్ పరిధిలో ఆటో, మోటారు సైకిల్, 8 ఆటో బ్యాటరీలు దొంగిలించారు. ఆయా కేసుల్లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. విలేఖరుల సమావేశంలో పెనమలూరు సీఐ దామోదర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

అగ్ని ప్రమాదంలో షెడ్డు దగ్ధం
కంకిపాడు, డిసెంబర్ 15: అగ్నిప్రమాదంలో చెరకు తోట షెడ్డు ప్రాంగణం దగ్ధమైన సంఘటన కంకిపాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం స్థానిక శివాలయం సమీపంలోని వైన్‌షాపు వెనుక మద్దాలి సాయిబాబు అనే రైతుతకు ఉన్న 1.40 ఎకరాల చెరకు తోటకు మంటలు అంటుకున్నాయి. మధ్యాహ్న సమయంలో స్థానికులు గుర్తించి మంటలు ఆర్పేందుకు యత్నించారు. అప్పటికే మంటలు పూర్తిగా పంటను కమ్మేసి చెరకు తోటకు ఎదురుగా ఉన్న చర్చి అ పక్కనే ఉన్న నాగేశ్వరరావు షెడ్డు ప్రాంగణంలోని కలప, ఇతర వ్యర్థాలకు మంటలు అంటుకున్నాయి. షెడ్డు ఖాళీగా ఉండటంతో నష్టం అధికంగా లేదు. అయితే చెరకు తోట మాత్రం పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఆటోనగర్ ఆగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో రూ 1.50లక్షలు నష్టం వాటిల్లి ఉంటుందని బాధితులు సాయిబాబు, ప్రభుదాస్ తెలిపారు. చెరకు తోట పక్కనే ఖాళీగా ఉన్న పంటపొలంలో వరిగడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు ఆరని సిగిరెట్ లేదా బీడీ పడేసి ఉండటం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని రైతు సాయిబాబు తెలిపారు.