క్రైమ్/లీగల్

సజ్జన్‌కు యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నాయకుడు సజ్జన్‌కుమార్‌కు కోర్టు యావజ్జీవశిక్ష విధించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు ఎస్ మురళీధర్, వినోదక్ గోయల్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ తీర్పును వెలువరించింది. సజ్జన్ రెచ్చగొట్టే ప్రసంగాలు హింసను ప్రేరేపించాయని కోర్టు స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేతపై హత్యానేరం రుజువైనందున జీవించి ఉన్నంత కాలం శిక్షను అనుభవించాలని ధర్మాసనం తీర్పునిచ్చింది. అలాగే డిసెంబర్ 31వ తేదీలోగా లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. సజ్జన్‌కుమార్ నగరం విడిచి వెళ్లకూడదని బెంచ్ స్పష్టం చేసింది. ఐదుగురు సిక్కు కుటుంబ సభ్యుల హత్య కేసులో సజ్జన్‌కుమార్‌ను ట్రయల్ కోర్టు నిర్దోషిగా పేర్కొనగా సీబీఐ హైకోర్టులో సవాల్ చేసింది. సోమవారం తీర్పును వెలువరించిన బెంచ్ అంతకు ముందు కేసుపై విచారణకు సీబీఐకు అనుమతి ఇచ్చింది. 1984 నవంబర్ 1న ఢిల్లీ కంటోనె్మంట్ ప్రాంతంలోని రాజ్‌నగర్‌లో కెహార్‌సింగ్, గుర్‌ప్రీత్‌సింగ్, రఘువీందర్ సింగ్, నరేందర్ పాల్‌సింగ్, కుల్దీప్ సింగ్ హత్యకు గురయ్యారు. ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం ఢిల్లీలో హింస పేట్రేగిపోయింది. సిక్కులపై విచ్చలవిడిగా దాడులు జరిగాయి. సుమారు 34 ఏళ్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు యావజ్జీవ శిక్ష విధించిన హైకోర్టు కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ బల్వాన్ ఖోఖర్, రిటైర్డ్ నేవీ కెప్టెన్
భగ్మాల్, గరిధర్‌లాల్, మాజీ ఎమ్మెల్యేలు మహేందర్ యాదవ్, కిషన్ ఖోఖర్‌లు యావజ్జీవ శిక్ష విధించింది. సిక్కుల ఇళ్ల దగ్ధం, గురుద్వారా ప్రాంతంలో హింసకు పాల్పడినట్టు కోర్టు నిర్ధారించింది. తమను దోషులుగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఐదుగురు నిందితులూ హైకోర్టుల సవాల్ చేసి భంగపడ్డారు. వారి పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2013 మేనెలలో సజ్జన్‌కుమార్‌ను నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు మిగతా ఐదుగురికి యావజ్జీవ శిక్ష విధించింది. బల్వాన్‌కుమార్, భగ్మాల్, లాల్‌కు యావజ్జీవ శిక్ష విధించిన కింది కోర్టు యాదవ్, కిషన్ ఖోఖర్ పదేళ్ల జైలు శిక్ష ప్రకటించింది. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో మార్చి 29న 11మంది నిందితులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. సిక్కుల ఊచకోత కేసుకు సంబంధించి మిగతావారిపై కేసులను కోర్టు మూసివేసింది. ఈకేసును మరో డివిజన్ బెంచ్ విచారించింది.