క్రైమ్/లీగల్

బొకారో రైలులో భారీ దొంగతనం:

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్వతీపురం (రూరల్), డిసెంబరు 18: బొకారో-అలెప్పీ రైలులో భారీ దొంగతనం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా, చెల్లూరు కు చెందిన రైల్వే కాంట్రాక్టర్ సత్యనారాయణకు చెందిన రెండు సూట్ కేసులు మాయమైనట్లు ఆయన మంగళవారం పార్వతీపురం రైల్వే స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా లోని ఆర్తబిర లో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి తన కటుంబంతో కలిసి వెళ్లి తిరుగు ప్రయాణంలో బొకారో లో ఈ సంఘటన జరిగిందన్నారు. ఇది టిట్లాఘర్-రాయఘ మధ్యలో జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసారు. ఆ సూట్ కేసులో ఉన్న 26 తులాల వడ్డాణం, 8 తులాల ఇన్ కట్స్ హారం 4 తులాల కొత్త గాజులు, 4 తులాల పాత గాజులు, తులమున్నర శంపంగి పువ్వు,, నాలుగున్నర తులాల లాకెట్ చైన్,3 తులాల కొత్త చైన్, తులం చెవి రింగులు, తులమున్నర బ్రాస్ లెట్, హ్యాండ్ చైన్ 3 తులాలు, నల్లపూజలు 4 తులాలు, జడ బిల్లలు 6 తులాలు బంగారం ట్రాలీ, వి. ఐ.వి లెథర్ సూట్‌కేసులలో పెట్టి చైన్ కట్టామన్నారు. సూట్ కేసులతో బంగారం అపహరణకు గురయ్యిందన్నారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా విజయనగరం లో ఫిర్యాదు చేయాలని తెలిపారన్నారు.,