క్రైమ్/లీగల్

సూరి హత్య కేసులో భానుకు యావజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 18: అనంతపురం జిల్లాలో ప్యాక్షనిజానికి కేంద్ర బిందువుగా పేరుగాంచిన మద్దెల చెరువుసూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి హత్య కేసులో మల్లిశెట్టి భానుకిరణ్‌కు హైదరాబాద్ నాంపల్లి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. మంగళవారం నాంపల్లి మెట్రోపాలిటన్ అదనపున్యాయమూర్తి కే సునీత తీర్పును ప్రకటించారు. భానుకిరణ్‌కు యావజ్జీవ శిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానాను విధించారు. భానుకు సహకరించిన మన్మోహన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. అలాగే 20 వేల రూపాయల జరిమానా విధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోతీవ్ర సంచలనం సృష్టించిన సూరి హత్యకేసులోమరో నలుగుర్ని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 2011 జనవరి 3వ తేదీన హైదరాబాద్ యూసఫ్‌గూడలోని నవోదయ కాలనీలో సూరి దారుణ హత్యకు గురయ్యాడు. సూరితోపాటు కారులో ప్రయాణిస్తున్న భాను వెనక సీట్లోంచి దేశవాళి తుపాకీతో కాల్పులు జరిపాడు. సూరి హత్యను నిర్ధారించుకున్న తరువాత కారుదిగి పారిపోయాడు. సూరి కారు డ్రైవర్ మధుమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2012 ఏప్రిల్ 21వ తేదీన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో భాను పోలీసులకు చిక్కాడు. సూరి హత్య కేసును సీఐడీ దర్యాప్తు
చేసింది. 2012 నుంచి సీఐడీ దాదాపు 117 మంది సాక్షులను విచారించింది. భానుకిరణ్‌పై మూడు చార్జిషీట్లను పోలీసులు దాఖలు చేశారు. చివరిగా 2016 ఆగస్టున మద్దెలచెర్వు సూరి భార్య భానుమతి వాంగ్మూలంతో కేసు పురోగతి సాధించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సుబ్బయ్య, వెంకటరమణ, హరిబాబు, వంశీని నాంపల్లి కోల్టు నిర్దోషులుగా విడుదల ప్రకటించింది. ప్రధాన సూత్రధారి భానుకిరణ్ ఆరున్నరేళ్లుగా హైదరాబాద్ చంచల్‌గూడ జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. మన్మోహన్ కూడా ఎనిమిదేళ్లు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
ఉరిశిక్ష పడాల్సింది: భానుమతి
రాప్తాడు: తన భర్త సూరిని హతమార్చిన భానుకిరణ్‌కు ఉరిశిక్ష పడాల్సిందని, అయితే కోర్టు యావజ్జీవంతో సరిపెట్టిందని మద్దలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి అన్నారు. సూరి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో మంగళవారం ఆమె అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మామిళ్లపల్లి గ్రామంలో విలేఖరులతో మాట్లాడుతూ భానుకిరణ్ విశ్వాసఘాతకుడని అన్నారు. సూరి హత్యకు మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులే సూత్రధారులని ఆరోపించారు. భానుకిరణ్‌కు ఉరిశిక్ష పడి ఉంటే సంతోషించేదానినని అన్నారు. అయినా కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ఇలాగైనా జైలు జీవితం ఎలా ఉంటుందో భానుకిరణ్‌కు తెలుస్తుందన్నారు. సూరిని ఎందుకు హత్య చేశానా అని భానుకిరణ్ జీవితాంతం జైలులో బాధపడతాడని అన్నారు. ఈ కేసుకు సంబంధించి మంత్రి పరిటాల సునీత కుటుంబీకులను సైతం విచారించి ఉంటే బాగుండేదని అన్నారు. సునీత కుటుంబం భానుకిరణ్‌కు సుఫారీ ఇచ్చి సూరిని హత్య చేయించిందని ఆమె ఆరోపించారు.

చిత్రాలు.. శిక్ష పడిన భానుకిరణ్ *హత్యకు గురైన మద్దెలచెరువు సూరి (ఫైల్‌పొటో )