క్రైమ్/లీగల్

చిదంబరానికి ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడుకి కోర్టు నుంచి ఊరట లభించింది. ఎయిర్‌సెల్-మాక్సిస్ కేసులో వారిద్దరికీ అరెస్టు నుంచి గతంలో ఇచ్చిన మినహాయింపును వచ్చే ఏడాది జనవరి 11 వరకు పొడిగిస్తున్నట్టు ఢిల్లీ హైకోర్టు మంగళవారం తెలిపింది. ఈ ఉదంతంతో వీరిద్దరికీ సంబంధం ఉందని నిరూపించే కొత్త ఆధారాలను సీబీఐ, ఈడీ కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో చిదరంబరం, ఆయన కుమారుడు కార్తిలను అరెస్టు చేయరాదని గతంలో ఇచ్చిన ఆదేశాలను జనవరి 11 వరకు పొడిగిస్తున్నట్టు ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి ఒపి సైనీ తెలిపారు.
అయితే ఈ కేసుకు సంబంధించి ఇతరులను సీబీఐ విచారించవచ్చునని కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా, ఈ కేసులో చిదంబరాన్ని ప్రాసిక్యూట్ చేయవచ్చునని తమకు అనుమతి ఇచ్చిందని సీబీఐ నవంబర్ 26న కోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో చిదంబరం కాక 18మందికి సంబంధం ఉందని సీబీఐ ప్రకటించింది. కోట్లాది రూపాయల అక్రమాలు ముడిపడి ఉన్నందున నిందితులను ప్రాసిక్యూట్ చేయాలని కోరింది. కాగా, అంతకుముందు చిదంబరం తరఫున హాజరైన న్యాయవాది కపిల్ సిబాల్ ఈ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తిపై దాఖలు చేసిన కేసులో అరెస్టు చేయకుండా ఇచ్చిన మినహాయింపును పొడిగించాలని కోర్టును కోరారు. దానిని కోర్టు అంగీకరించి వారిని జనవరి 11 వరకు అరెస్టు చేయరాదని మినహాయింపు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇద్దరూ గతంలో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. తాము దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదంటూ చేస్తున్న ఆరోపణలను తండ్రీ కొడుకులిద్దరూ ఖండించారు. తాము దర్యాప్తు సంస్థలకు అందుబాటులోనే ఉంటామని, తమను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని గతంలోనే వీరు విజ్ఞప్తి చేశారు.