క్రైమ్/లీగల్

ఆ చిరుద్యోగి... అవినీతిలో ఘనాపాఠి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తణుకు, డిసెంబర్ 30: గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్)లో అతడో చిరుద్యోగి... వయస్సు నాలుగు పదులు కూడా దాటలేదు... అయినా ఆదాయానికి మించిన ఆర్జనలో ఆరితేరిపోయాడు. మార్కెట్ విలువ ప్రకారం సుమారు రూ.200 కోట్ల విలువైన ఆస్తులు ఈ చిరుద్యోగి ఆర్జించాడు. 85.62 ఎకరాల వ్యవసాయ భూమి, 19ఇళ్ల స్థలాలు, మూడు ఫ్లాట్లు, నాలుగు భవనాలు, ఐదు కార్లు, 50 కాసుల బంగారం, ఐదు లక్షల నగదు... పశ్చిమ గోదావరి జిల్లాలోని సదరు చిరుద్యోగి స్వగ్రామంలో ఆదివారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాల సందర్భంగా గుర్తించిన ఆస్తుల చిట్టా ఇది. వివరాల్లోకి వెళితే... ఏలూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆర్‌ఎస్‌పిడి దివాకర్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నట్టు ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆర్పీఠాకూర్‌కు సమాచారం ఆయన ఆదేశాల మేరకు ఏసీబీ సెంట్రల్ ఇనె్వస్టిగేషన్ బృందం అడిషినల్ ఎస్పీ రమాదేవి ఆధ్వర్యంలో ఆదివారం సోదాలు నిర్వహిచారు. దివాకర్ స్వగ్రామం ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో అతని ఇంటితోపాటు బంధువుల ఇళ్లలో ఆదివారం సోదాలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి ఈ సోదాలు నిర్వహించారు. సోదాల సందర్భంగా లభించిన పలు స్థిరాస్తుల డాక్యుమెంట్లు చూసి ఏసీబీ అధికారులే విస్తుపోయారు. మొత్తం 63 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఏసీబి ఆధికారులు గుర్తించిన ఆస్తుల్లో దివాకర్ పేరిట ఆరు ఇళ్ల స్థలాలు, జి ప్లస్ 2 భవనం (3000 చదరపు అడుగులు), డూప్లెక్స్ ఫాంహౌస్ (4000 చదరపు అడుగులు), వాణిజ్య భవనాలు జి ప్లస్ 3 ఒకటి (23,000 చదరపు అడుగులు), గోడౌన్ 1 (2500 చదరపు అడుగులు), ఒక ఫ్లాట్, 44.36 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. అలాగే దివాకర్ తల్లి ఆర్ వెంకట సుబ్బలక్ష్మి పేరిట ఏడు ఇళ్ల స్థలాలు, ఒక ఫ్లాట్, 18.21 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నాయి. దివాకర్ సోదరుడు ఆర్‌ఎస్‌ఆర్‌కె కిరణ్‌కుమార్ పేరిట 6 ఇళ్ల స్థలాలు, ఒక ఫ్లాట్, 23.11 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు సోదాల సందర్భంగా వెల్లడయ్యింది. అలాగే ఇంట్లో ఖరీదైన విదేశీ వాచీలు, ఖరీదైన గృహోపకరణాలున్నట్టు గుర్తించారు. ఈ దాడుల్లో ఎసీబీ అడిషినల్ ఎస్పీ రమాదేవితోపాటు ఇన్‌స్పెక్టర్లు బి సుదర్శన్‌రెడ్డి, ఎల్ సన్యాసినాయుడు, బాస్కర్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఆస్తుల చిట్టా ఇదే..
వ్యవసాయ భూమి:
85.62 ఎకరాలు
ఇళ్ల స్థలాలు : 19
ఫ్లాట్లు:03

భవనాలు: 04
నగదు:

రూ.5 లక్షలు
బంగారం: అర కిలో
వెండి: రెండు కిలోలు
ఎల్‌ఐసీ బాండ్లు:
రూ.10 లక్షలు
కార్లు: 05
(వోక్స్‌వాగన్-2, ఇండిగో-1, ఇన్నోవా-1, క్రెడా-1)
టూవీలర్స్: 2.

చిత్రం.. ఏసీబీ గుర్తించిన ఆస్తులు
(ఇన్‌సెట్‌లో ) * ఏలూరు ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌ ఆర్‌ఎస్‌పిడి దివాకర్