క్రైమ్/లీగల్

బాలుడి కిడ్నాపర్ దొరికాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, డిసెంబర్ 30: తిరుమలలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన వీరేశ్ (16 నెలలు) ఉదంతం సుఖాంతమైంది. బాలుడిని తీసుకుని వెళుతున్న నిందితుడు మహారాష్టల్రోని నాందేడ్ ప్రాంతం మహర్‌లోని రేణుకాదేవి ఆలయం వద్ద మహారాష్ట్ర పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని తిరుమలలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు సీఐ సుబ్రహ్మణ్యం బృందం ఆదివారం మహారాష్టక్రు వెళ్లింది. కాగా కిడ్నాపర్ విశ్వంబర్ (43) నిజామాబాద్ జిల్లా శాస్ర్తీనగర్‌కు చెందినవాడు. సోషల్ మీడియాలో విస్తృతంగా నిందితుడు, కిడ్నాప్‌నకు గురైన బాలుడి చిత్రాలు, సమాచారం ప్రసారం కావడంతో నాందేడ్‌లో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మీడియా, సోషల్ మీడియా ఆధారంగా నిందితుడు పట్టుబడ్డప్పటికీ కేసును ఛేదించడంలో తిరుమల, తిరుపతి పోలీసులు నిందితుడు, బాలుడికి సంబంధించిన చిత్రాలు, సమాచారాన్ని విస్తృతంగా ప్రచారం చేయడం ఎంతోగానో దోహదపడిందనే చెప్పాలి. అంతేకాకుండా తిరుమలలో విస్తృతంగా సీసీటీవీలు ఏర్పాటు చేయడంవల్ల కూడా ఈ కేసును ఛేదించడంలో కీలక భూమిక పోషించినట్లే. వివరాల్లోకి వెళితే.. మహారాష్టక్రు చెందిన ప్రశాంత్ దంపతులు తమ కుమారుడు వీరేశ్‌తో కలిసి శుక్రవారం తిరుమలకు వచ్చారు. వారికి వసతి గది దొరకకపోవడంతో పీఏసీ 2 (మాధవం నిలయం)లో బస చేశారు. శనివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో నిందితుడు తల్లితండ్రుల వద్ద ఉన్న వీరేశ్‌ను కిడ్నాప్ చేశాడు. నేరుగా రేణిగుంట రైల్వేస్టేషన్ చేరుకున్న నిందితుడు కౌంటర్లో నాందేడ్‌కు టికెట్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా తప్పుడు చిరునామాను దరఖాస్తులో పొందుపరిచాడు. అయితే సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుడు ఏ రైల్లో ప్రయాణించింది గుర్తించిన పోలీసులు ఆ దిశగా గాలింపును వేగవంతం చేసి ఫలితం సాధించారు. అయితే నిందితుడు ఆ బాలుడిని ఎక్కడకు, ఎందుకు తీసుకెళుతున్నాడు.. పెంచుకోవడానికా లేక ఎవరికైనా విక్రయించడానికా? మహారాష్ట్ర వైపు ఎందుకు వెళ్లాడు? బాలుడి కుటుంబానికి సంబంధించి నిందితుడికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.
గతేడాది ఇద్దరు చిన్నారులు కిడ్నాప్‌కు గురై తిరిగి గుర్తించిన విషయం పాఠకులకు విధితమే. కాగా తిరుమలలో వేల సంఖ్యలో భక్తుల సంచారం ఉన్న క్రమంలో కిడ్నాపర్లు అతి సునాయాసంగా పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి కేంద్రంగా మార్చుకుంటున్నారన్న అనుమానాలు భక్తుల్లో వ్యక్తమవుతున్నాయి.