క్రైమ్/లీగల్

అతివేగం.. నలుగుర్ని చిదిమేసింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: గుంటూరు నగరానికి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగానికి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. గుంటూరు-చిలకలూరిపేట జాతీయ రహదారిపై గుంటూరు రూరల్ లాలుపురం వద్ద సోమవారం 170 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు మలుపువద్ద అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని, అంతే వేగంతో ముందుగా వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. కారు ఢీకొట్టిన వేగానికి లారీ సైతం బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నగరానికి సమీపంలోని ఆర్‌వీఆర్ అండ్ జేసీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో
ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్సకోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఏడుగురు విద్యార్థులు ఒకే కారులో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు విజయవాడ వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదంలో గుంటూరు విద్యానగర్‌కు చెందిన ధనుష్, పెదకూరపాడు మండలం కంభంపాడుకు చెందిన సాయిరామ్, శావల్యాపురానికి చెందిన కోటేశ్వరరావు, గఫూర్ అనే మరో విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన శివాజీ, కౌషిక్ గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో, హీరేంద్ర నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా 19, 20 సంవత్సరాల్లోపు వయస్సువారే. కారు ఢీకొన్న ధాటికి లారీ బోల్తాపడటంతో డ్రైవర్, క్లీనర్ సైతం తీవ్రగాయాల పాలయ్యారు. సంఘటనా స్థలాన్ని జిల్లా అర్బన్ ఎస్పీ సీహెచ్ విజయారావు సందర్శించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం జీజీహెచ్‌కు తరలించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం..ప్రమాద తీవ్రతకు నుజ్జునుజ్జయిన కారు