క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబుళదేవరచెరువు, మార్చి 13: మండల పరిధిలోని కొండకమర్ల దిగువ ఎస్సీ కాలనీకి చెందిన గౌరమ్మ (28) అనే వివాహిత కడుపునొప్పి తాళ లేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు గౌరమ్మకు తరచూ కడుపునొప్పి వస్తుండేదని, పలు వైద్యశాలల్లో చికిత్స చేయించినప్పటికీ నయం కాలేదన్నారు. సోమవారం విపరీతమైన కడుపునొప్పి రావడంతో ఆమె పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
వ్యక్తి ఆత్మహత్య
గుంతకల్లు రూరల్, మార్చి 13 : పట్టణంలోని హనుమేష్ నగర్‌లో నివాసం ఉంటున్న నారాయణస్వామి(50) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. నారాయణస్వామి తోపుడు బండిలో అరటి పండ్ల వ్యాపారం చేస్తూ హనుమేష్‌నగర్‌లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈనేపథ్యంలో భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యలు తలెత్తాయి. ఇందులో భాగంగానే భార్య వెంకటలక్ష్మీ, కుమార్తెలు ఐదు రోజుల క్రితం పుట్టిళ్లు బత్తలపల్లికి వెళ్లారు. దీంతో మనస్థాపానికి గురైన నారాయణస్వామి ఇంట్లో ఎవరులేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే కాలనీలో దుర్వాసన వెదజల్లడంతో ఇంటి యజమానితోపాటు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు తెరిచి చూడగా విషయం బయటపడిందన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు.

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
అనంతపురం అర్బన్, మార్చి 13: నగరంలోని రామ్‌నగర్ ఎస్‌ఎల్‌వి బార్ వద్ద మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి అతిగా మద్యం తాగి మృతి చెందాడు. మృతునికి సంబంధించి వివరాలు లభ్యం కాలేదు. నాల్గవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శేఖర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.