క్రైమ్/లీగల్

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, డిసెంబర్ 31: ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తునానని హాస్టల్ చేరుతాడు. అనంతరం హాస్టల్‌లో ఖరీదైన సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లను వినియోగించే వారితో పరిచయం పెంచుకుంటాడు. నమ్మిన తరువాత సెల్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌లతో ఉడాయిస్తాడు. మరి కొందరితో దేశంలోని వివిధ దేవాస్థానాలలో తనకు పరిచయస్తులున్నారని అక్కడ నుంచి విలువైన అద్భుతాలు కలిగిన సామాగ్రి తెస్తానని నమ్మించి అందినంత దండుకుని అనంతరం అక్కడ నుంచి ఉడాయిస్తాడు. రెండు తెలుగు రాష్టల్రతో పాటు కర్ణాటకలో అనేక మందిని మోసం చేసిన ఘరాన నిందితుడిని నార్సింగ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 18లక్షల విలువ చేసే 4లక్షల 50వేల రూపాయలు నగదు, 171 గ్రాముల బంగారం ఆభరణాలు, 9ల్యాప్ ట్యాప్‌లు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు మాదాపూర్ డీసీపీ వెంకటేశర రావు తెలిపారు. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన అబ్బూరి సోమయ్య చౌదరి అలీయాస్ శ్రీకాంత్ చౌదరి (38) జల్సాలకు అలవాటు పడి దొంగతనాలు చేస్తున్నాడు. ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా అనిచెప్పి హాస్టల్లో చేరి అక్కడ వారందరిని నమ్మిస్తాడు. హాస్టల్‌లో విలువైన ఫోన్లులు ల్యాప్ ట్యాప్‌లను తీసుకుని ఉడాయిస్తాడు. నెల్లూరులో తనకు కస్టమ్స్ అధికారులు తెలుసని బంగారం తక్కువ ధరకు ఇప్పిస్తానని నమ్మించి 13లక్షలు కాజేసాడు. అద్భుతాలు కలిగిన రాగి చెంబును హరిద్వార్ నుంచి రప్పిస్తానని సైఫాబాద్ చెందిన ఓ వ్యక్తి వద్ద 19లక్షల 30వేల రూపాయలు తీసుకుని పరార్ అయ్యాడు. మూడు నగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలోని 28 పోలీసు స్టేషన్‌లలో 58 నేరాలకు పాల్పడినట్లు డీసీపీ తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసిన నార్సింగ్ పోలీసులను అభినందించారు. కార్యక్రమంలో మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్‌రావు, సీఐ, రామన్ గౌడ్, డీఐ, లక్ష్మినారాయణ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.

రాజీవ్ గృహకల్పలో తనిఖీలు
కీసర, డిసెంబర్ 31: సోమవారం తెల్లవారు ఝామున కీసర మండలం, రాజీవ్ గృహకల్పలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. మల్కాజ్‌గిరి డీసీపీ ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 220 మంది పోలీసులతో కాలనీలోని అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వ్యక్తిగత గుర్తిపు కార్డులు, వాహన ధృవీకరణ పత్రాలు పరిశీలించారు. పోలీసులు నిర్వహించిన కార్డెన్ సెర్చ్‌లో 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని, 8 ద్విచక్ర వాహనాలు, కారు, సిలిండర్, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఉమామహేశ్వర శర్మ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, శాంతి భద్రతల దృష్ట్యా ఇలాంటి తనిఖీలు సర్వ సాధారణమని అన్నారు. ఎవరైనా అనుమానితులు కాలనీల్లో సంచరిస్తుంటే వెంటనే పోలిసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ శివకుమార్, సీసీఎస్ సీఐ భాస్కర్, కీసర సీఐ ప్రకాశ్, ఎస్‌ఐ శోభన్‌బాబు పాల్గొన్నారు.