క్రైమ్/లీగల్

డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: అంతరాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టును టాస్క్ ఫోర్సు పోలీసులు రట్టు చేశారు. నూతన సంవత్సర సంబరాల్లో పాల్గొనే యువతకు డ్రగ్స్ సరఫరా చేసే అవకాశం ఉందని నిఘా పెట్టిన పోలీసులకు ఈ ముఠా పట్టుబడింది. డ్రగ్స్ మాఫియా సభ్యులైన జోసెఫ్, శంకర్‌ను పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి రూ.10 లక్షల విలువైన 89 గ్రాముల కొకైన్‌ను, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ స్పందిస్తూ ఈ మాఫియా నైజీరీయన్స్‌ను నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఒక గ్రాము కొకైన్‌ను రూ.3 వేలకు ఖరీదు చేసి, దానిని సుమారు 6 వేల వరకు విక్రయిస్తుంటారని ఆయన తెలిపారు. గోవా కేంద్రంగా ఈ ముఠా కొకైన్‌ను విక్రయిస్తున్నట్లు ఆయన వివరించారు.