క్రైమ్/లీగల్

తక్షణ విచారణకు నో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు విభజనపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం న్యాయవాదులు కె.సీతారాం, కె జగన్మోహన్‌రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించినప్పటికి, అత్యవసర విచారణ చేపట్టలేమని స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు న్యాయవాదుల తరపున సుప్రీంకోర్టు రిజస్ట్రార్ వద్ద అడ్వొకేట్ అన్ రికార్డ్సు ప్రవీణ్ చతుర్వేది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ హౌస్‌మోహన్‌గా స్వీకరించాలని రిజస్ట్రార్‌ను కోరారు. ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ కార్యాలయంలో పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. దీంతో సోమవారం ఈ పిటిషన్ దాఖలు కాగా రిజస్ట్రి అధికారులు పిటిషన్ స్వీకరించి నంబరు ఇచ్చి జనవరి 2న విచారణ జాబితాలో చేరుస్తున్నట్టు వెల్లడించారు. దీంతో హైకోర్టు విభజనుకు అడ్డకులు తొలిగినట్టు అయింది. ఉమ్మడి హైకోర్టు విభజన ప్రక్రియ యథాతధంగా కొనసాగనుంది. కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం రెండు హైకోర్టు విభజన జరగనుంది. మంగళవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అలాగే హైకోర్టు తరలింపునకు సంబంధించి ఎలాంటి పిటిషన్ దాఖలైన తమకు తెలిజేయాలని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం కెవియేట్ దాఖలు చేసింది. అమరావతిలో ఏపీ హైకోర్టు భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తయ్యే వరకు ఏపీ హైకోర్టు తరలింపు గెజిట్ నోటిఫికేషన్ అమలు నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని, అమరావతిలోని పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని ఏపీ న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు.