క్రైమ్/లీగల్

విద్యార్థుల విహారయాత్రలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుప్పం, జనవరి 1: నూతన సంవత్సరం కోలాహలంగా, సంతోషంగా గడపాలని విహారయాత్రకు వచ్చిన 60మంది విద్యార్థుల్లో ఒక విద్యార్థి నీటమునిగి దుర్మరణం పాలైన సంఘటన ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులో మంగళవారం జరిగింది. కర్నాటక పోలీసుల కథనం ప్రకారం కర్నాటక రాష్ట్రం బంగారుపేట సమీపంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన 50మంది పాఠశాల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు విహారయాత్రకు గుడుపల్లి మండలం సరిహద్దులోని గుడివంక వెనుక ఉన్న చెరువుకు వచ్చారు. అంతవరకు అందరూ కలసి ఆహ్లాదంగా ఆడుకున్న విద్యార్థుల్లో ఇద్దరు కాస్త దూరంలో ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. ఇది గమనించిన అటుగా వెళ్తున్న ఆటోడ్రైవర్ చెరువులోకి దూకి ఒకరిని కాపాడగలిగాడు. మరో విద్యార్థి మహేష్(12) నీటిలో మునిగిపోయాడు. తమ కళ్లెదుటే సహవిద్యార్థి దుర్మరణం చెందడంతో విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈమేరకు బంగారుపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.