క్రైమ్/లీగల్

మాట్కా బీటర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 13 : హిందూపురం ప్రాంతంలో మట్కా కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఉంచి 25 మంది మట్కా బీటర్లను అరెస్టు చేసి వారి నుండి రూ.6,52,480 నగదు స్వాధీనం చేసుకున్నట్లు పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్ తెలిపారు. మంగళవారం రాత్రి స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హిందూపురం ప్రాంతంలో మట్కా కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తనిఖీల్లో భాగంగా వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 9 మంది మట్కా బీటర్లను అరెస్టు చేసి వారి నుండి రూ.3,40,120 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే టూటౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో 13 మందిని అరెస్టు చేసి రూ.1,72,080, లేపాక్షి, రూరల్ మండలాల పరిధిలో ముగ్గురిని అరెస్టు చేసి వారి నుండి రూ.1,40,280 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 25 మంది మట్కా బీటర్ల ద్వారా రూ.6,52,480 నగదుతోపాటు మట్కా పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే మట్కా నిర్వాహకులు చికెన్‌బాబా, నారాయణస్వామి, బీటర్ మున్నీ పరారీలో ఉన్నారని, త్వరలోనే అరెస్టు చేయనున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన బీటర్లను కోర్టులో హాజరు పరచినట్లు వివరించారు.