క్రైమ్/లీగల్

నెత్తురోడిన రహదారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 2: గుంటూరు జిల్లాలో రహదారులు నెత్తురోడాయి. బుధవారం జరిగిన రెండు ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. కంటైనర్‌ను కారు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు మృతిచెందగా. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బుధవారం యడ్లపాడు - వంకాయలపాడు గ్రామాల నడుమ జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల పాపతో సహా నలుగురు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డుపై ఆగివున్న కంటైనర్‌ను కారు బలంగా ఢీకొట్టడంతో ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. కారు ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం
నుజ్జునుజ్జు కాగా, లారీ వెనుక ప్రాంతం ధ్వంసమైంది. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ములకలచెరువు గ్రామానికి చెందిన ఏడుగురు తూర్పు గోదావరి జిల్లా యర్రవరంలో ఒక వివాహ వేడుకలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదానికి గురయ్యారు. కారులో ప్రయాణిస్తున్న సుందరరామరాజు (33), భారతి (54), కశ్విని (2)లతో పాటు పేరు తెలియని మరో మహిళ కూడా మృతిచెందారు. క్షతగాత్రులు కాటూరి మెడికల్ కళాశాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిలకలూరిపేట రూరల్ సీఐ శోభన్‌బాబు, యడ్లపాడు ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విజయపురిసౌత్ పోలీసు స్టేషన్ పరిధిలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న మరో ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నాగార్జునసాగర్ నుండి మాచర్ల వైపు వస్తున్న ద్విచక్ర వాహనం, మాచర్ల నుండి నల్గొండకు వెళుతున్న మరో ద్విచక్ర వాహనం ఎన్టీపీసీ-తాళ్లపల్లి మధ్య ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ద్విచక్రవాహనంపై శ్రీరామదాసు నాగబ్రహ్మాచారి, వెంకటసాయి (11), నాగలక్ష్మీ, ఝాన్సీ, మణిదీప్తి (8)లు ఐదుగురు ప్రయాణిస్తుండటం గమనార్హం. ఈ ప్రమాదంలో సురేష్ (35), వెంకటసాయి తలలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడ్డ బాలిక మణిదీప్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.

చిత్రం..కంటైనర్‌ను ఢీకొని నుజ్జయిన కారు