క్రైమ్/లీగల్

అనుమానాస్పదస్థితిలో తండ్రీకొడుకు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 13: అనుమానాస్పదస్థితిలో తండ్రి కొడుకు మురుగునీటి శుద్ధి ప్లాంటులో పడి మరణించారు. ప్రమాదవశాత్తు నీటిలో జారి పడి మరణించారా లేక దూకి ఆత్మహత్య చేసుకున్నారా.. అనే అనుమానం వ్యక్తమవుతోంది. విషాదకరమైన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ కుమార్ (24) కుటుంబ సభ్యులతో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి కొనే్నళ్ల క్రితం వచ్చారు. రాజేంద్రనగర్ కాటేదాన్‌లో నివసిస్తున్న ఇతడు కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉప్పల్ సూర్యనగర్‌లో ఉంటున్న సోదరుడు మదన్‌కుమార్ వద్దకు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. ఇటీవల వచ్చి నల్లచెరువు కింద వెల్డింగ్ షాపులో కొన్ని రోజులు పని చేశాడు. చేసిన పనికి ఇచ్చే జీతం విషయంలో సోమవారం ఉప్పల్‌కు వచ్చాడు. భార్య పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమారుడు విషాల్ కుమార్‌ను వెంట తీసుకొచ్చాడు. మధ్యాహ్నం 11గంటలకు వచ్చిన అరవింద్ వెల్డింగ్ షాపునకు వెళ్లాడు. అదే సమయంలో బయటకు వెళ్లిన షాపు యజమాని అన్నం తిన్న తర్వాత వస్తానని చెప్పడంతో అప్పటి వరకు విశ్రాంతి తీసుకోవడానికి పక్కనే ఉన్న పోచమ్మ ఆలయానికి వెళ్లారు. తండ్రి నిద్రలో ఉండగా కుమారుడు బయట ఆడుకుంటూ పక్కనే ఉన్న సివరేజ్ మురుగునీటి శుద్ధి కేంద్రం వద్దకు వెళ్లి అందులో పడి పోయాడు. కొద్ది సేపట్లోనే నిద్ర నుంచి తేరుకున్న తండ్రి కుమారుడు విషాల్ కన్పించకపోవడంతో వెతుకుంటూ ముందుకు వెళ్లగా నీటిలో మునిగి తేలుతున్నాడు. రక్షించేందుకు ప్రయత్నిస్తూ అతడు కూడా నీటిలో పడిపోయాడు. మురుగునీళ్లు మింగిన తండ్రీకొడుకులు మరణించారు. సాయంత్రం వరకు వీరిద్దరు కన్పించకపోవడంతో మృతుడి సోదరుడు మదన్ కుమార్ కంగారు పడుతూ గాలించినా ప్రయోజనం లేకపోయింది. వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
మంగళవారం ఉదయం మురుగునీటిలో మృతదేహాలు లభ్యం కావడంతో అందిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ పీ.వెంకటేశ్వర్లు తెలిపారు.
ఆడుకుంటూ వెళ్లి కుంటలో జారిపడిన కుమారుడుని రక్షించబోయి తండ్రి కూడా మరణించారని పేర్కొన్నట్లు చెప్పారు.