క్రైమ్/లీగల్

మోటారు వాహనాల దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట), జనవరి 10: గుంటూరు నగరంలో మోటారు వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని కటకటాల వెనక్కి పంపారు నల్లపాడు పోలీసులు. గురువారం నల్లపాడు పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నల్లపాడు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బాలమురళీకృష్ణ నిందితుడి వివరాలను వెల్లడించారు. గుంటూరు నగరంలోని నల్లపాడు స్టేషన్ పరిధిలో స్వర్ణ్భారతినగర్‌కు చెందిన గుండా అనీల్‌కుమార్ గతంలో కొన్ని కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. చెడు వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో గుంటూరు ఇన్నర్‌రింగ్ రోడ్డు వద్ద గత నెలలో బజాజ్ అటోను, నగరంపాలెం పోలీసుస్టేషన్ పరిధిలో ఒక ద్విచక్ర వాహనాన్ని అపహరించాడు. నగరంలో సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలను పరిశీలిస్తుండగా అనిల్‌కుమార్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి వద్ద నుంచి ఆటో, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ తెలిపారు. వీటి విలువ లక్షా 70 వేలు ఉంటుందన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సిసియస్ సిఐలు అబ్దుల్‌కరీం, సుబ్రహ్మణ్యం, సురేష్‌బాబు, సిసియస్ సిబ్బంది కోటేశ్వరరావు, సాంబశివరావు, కిషోర్, కరీంబాషా, రాజు, విజయ్‌లు పాల్గొన్నారు.