క్రైమ్/లీగల్

దుప్పి మాంసం పంచుకుంటున్న నలుగురిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైరెడ్డిపల్లి, జనవరి 10: మండలంలోని తీర్థం గ్రామానికి చెందిన నలుగురు దుప్పి మాంసం పంచుకుంటున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పలమనేరు అటవీశాఖ రేంజర్ మదన్‌మోహన్‌రెడ్డి గురువారం తెలిపారు. బుధవారం తీర్థం సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద అదే గ్రామానికి చెందిన జయరాం, శ్రీనివాసులు, చిన్న, నాగరాజులు దుప్పి మాంసం పంచుకుంటుండగా అటవీ సిబ్బంది దాడి చేశారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు మిగిలిన ఇద్దరు పరారయ్యారని తెలిపారు. వీరిపై వణ్యప్రాణుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.